శ్రీ శ్రీ శ్రీ రాజావారు ట్రైలర్ రిలీజ్

Sri Sri Sri Rajavaru Movie Trailer out now

మ్యాడ్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చి కెరీర్ లో తొలి హ్యాట్రిక్ ఖాతాలో వేసుకున్నాడు ఎన్టీఆర్ బావమరిది ,యంగ్ హీరో నార్నే నితిన్.మ్యాడ్ తరువాత గత ఏడాది సోలో హీరోగా ఆయ్ తో వచ్చి మరో హిట్ కొట్టాడు.ఇక ఈఏడాది మ్యాడ్ సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్ తో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.మార్చి లో విడుదలైన ఈసినిమా 70కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.ఇక ఈ హీరో నెక్స్ట్ శ్రీ శ్రీ శ్రీ రాజావారు తో రానున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జాతీయ అవార్డు విన్నర్ శతమానం భవతి ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది.మ్యాడ్ స్క్వేర్ కన్నా ముందే షూటింగ్ పూర్తి చేసుకుంది.పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం అవ్వడం వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది.ఇక ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.ఈ ట్రైలర్ అయితే ప్రామిసింగ్ గా అనిపించింది. ఇందులో నితిన్ మాస్ గా కనిపించాడు.

శ్రీ శ్రీ శ్రీ రాజావారు సంపద హీరోయిన్ గా నటించగా శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు నిర్మించారు.యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాకు కైలాష్ మీనన్ సంగీతం అందిస్తున్నాడు.జూన్ 6న ఈసినిమా విడుదలకానుంది. మరి ఈసినిమాతో నార్నె నితిన్ విజయపరంపర ను కొనసాగిస్తాడో లేదో చూడాలి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.