యూనివర్సల్ కమల్ హాసన్ ప్రధానపాత్రలో, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘థగ్ లైఫ్’. ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలై ప్రమోషనల్ కంటెంట్ నేషనల్ వైడ్‌గా సెన్సేషన క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో నితిన్ ఫాదర్ ఎన్ సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. గతంలో విక్రమ్, అమరన్ లాంటి బ్లాక్‌బస్టర్లు అందించిన ఈ సంస్థ ఇప్పుడు ‘థగ్ లైఫ్’ భారీగా విడుదల చేయబోతోంది. ఈ రోజు మేకర్స్ వైజాగ్‌లో గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా నటుడు నాజర్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. థగ్ లైఫ్ ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక ముఖ్యమైన ఫిల్మ్ అవుతుంది. వైజాగ్ లోనే కమల్ హాసన్ గారు చాలా రోజుల ముందు ఒక చరిత్ర రాశారు. అదే ‘మరో చరిత్ర’. ఇప్పుడు మరో చరిత్రగా ఈ సినిమా మీ ముందుకు వస్తుంది.” అని పేర్కొన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఈ సినిమా ఇండియాలో ది బెస్ట్ డైరెక్టర్ మణిరత్నం గారు, ది బెస్ట్ రెహమాన్ గారు, బెస్ట్ యాక్టర్ కమల్ హాసన్ గారు.. ఇలా ద బెస్ట్ టీం కలిసి చేస్తున్న సినిమా ఇది. కమల్ హాసన్ గారు, మణిరత్నం గారు 37 ఏళ్ల తర్వాత కలిసి ఒక యాగంలా ఈ సినిమా చేశారు. ఇది ఒక అద్భుతమైనటువంటి జర్నీ. ఈ సినిమా ఖచ్చితంగా మీరు చూడాలి. ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























