థగ్ లైఫ్.. ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు

Actress Trisha Excited About Her Character in Thug Life

యూనివర్సల్ కమల్ హాసన్ ప్రధానపాత్రలో, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘థగ్ లైఫ్’. ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలై ప్రమోషనల్ కంటెంట్ నేషనల్ వైడ్‌గా సెన్సేషన క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నితిన్ ఫాదర్ ఎన్ సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. గతంలో విక్రమ్, అమరన్ లాంటి బ్లాక్‌బస్టర్లు అందించిన ఈ సంస్థ ఇప్పుడు ‘థగ్ లైఫ్’ భారీగా విడుదల చేయబోతోంది. ఈ రోజు మేకర్స్ వైజాగ్‌లో గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా హీరోయిన్ త్రిష మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ‘వర్షం’ సినిమా రిలీజై 22 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ ఇంత అభిమానం చూపిస్తున్న మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. వైజాగ్ నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో కమల్ హాసన్ గారితో ఫస్ట్ టైం కలిసి వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఇంద్రాణి అనే క్యారెక్టర్ చేశాను. తప్పకుండా ఆడియన్స్‌కి గుర్తుండిపోయే పాత్ర ఇది. ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. తప్పకుండా ఈ సినిమా మీరు చూడాలి. కచ్చితంగా మీకు నచ్చుతుంది” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.