కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

కమల్, మణిరత్నం ఒక యాగంలా ఈ సినిమా చేశారు

Kamal Haasan and Mani Ratnam Filmed Thug Life as Yagnam, Says Actor Nassar

కమల్, మణిరత్నం ఒక యాగంలా ఈ సినిమా చేశారు

Kamal Haasan and Mani Ratnam Filmed Thug Life as Yagnam

Kamal Haasan and Mani Ratnam Filmed Thug Life as Yagnam, Says Actor Nassar

యూనివర్సల్ కమల్ హాసన్ ప్రధానపాత్రలో, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'థగ్ లైఫ్'. ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలై ప్రమోషనల్ కంటెంట్ నేషనల్ వైడ్‌గా సెన్సేషన క్రియేట్ చేసింది.

హీరో నితిన్ ఫాదర్ ఎన్ సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. గతంలో విక్రమ్, అమరన్ లాంటి బ్లాక్‌బస్టర్లు అందించిన ఈ సంస్థ ఇప్పుడు 'థగ్ లైఫ్' భారీగా విడుదల చేయబోతోంది. ఈ రోజు మేకర్స్ వైజాగ్‌లో గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా నటుడు నాజర్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. థగ్ లైఫ్ ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక ముఖ్యమైన ఫిల్మ్ అవుతుంది. వైజాగ్ లోనే కమల్ హాసన్ గారు చాలా రోజుల ముందు ఒక చరిత్ర రాశారు. అదే 'మరో చరిత్ర'. ఇప్పుడు మరో చరిత్రగా ఈ సినిమా మీ ముందుకు వస్తుంది." అని పేర్కొన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. "ఈ సినిమా ఇండియాలో ది బెస్ట్ డైరెక్టర్ మణిరత్నం గారు, ది బెస్ట్ రెహమాన్ గారు, బెస్ట్ యాక్టర్ కమల్ హాసన్ గారు.. ఇలా ద బెస్ట్ టీం కలిసి చేస్తున్న సినిమా ఇది. కమల్ హాసన్ గారు, మణిరత్నం గారు 37 ఏళ్ల తర్వాత కలిసి ఒక యాగంలా ఈ సినిమా చేశారు. ఇది ఒక అద్భుతమైనటువంటి జర్నీ. ఈ సినిమా ఖచ్చితంగా మీరు చూడాలి. ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం" అని అన్నారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్