మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సూపర్ స్టార్ మహేష్ బాబు, టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా ఖలేజా.అతడు తరువాత వీరి కాంబో లో వచ్చిన సినిమా కావడంతో నెక్స్ట్ లెవెల్ హైప్ తో రిలీజయ్యింది.అయితే మొదటి షో నుండే నెగిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేసింది.కానీ ఆతరువాత టీవీల్లో వచ్చాక సినిమా ఎలా ఫెయిల్ అయ్యిందన్న ప్రశ్నలు వచ్చాయి.చాలా మందికి నచ్చింది ఈసినిమా కానీ రిలీజైనప్పుడు మాత్రం డిజాస్టర్ అయ్యింది.
ఇక ఈసినిమా ఈ రోజు రీ రిలీజయ్యింది.మీడియం హైప్ వున్న సినిమాకు ఎన్ని థియేటర్లు దొరుకుతాయో అంత గ్రాండ్ గా రిలీజయ్యింది ఖలేజా.ప్రీ సేల్స్ అయితే 4 కోట్లకు పైగా జరిగాయి.మొదటి రోజు చాలా చోట్ల షోస్ హౌస్ ఫుల్ అవుతున్న.దాంతో భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది.తొలిరోజు కలెక్షన్స్ షాక్ ఇవ్వనున్నాయి.రీ రిలీజ్ సినిమాల్లో తెలుగు నుండి ఇప్పటివరకు గబ్బర్ సింగ్ హైయెస్ట్ వసూళ్లను రాబట్టిన సినిమాగా వుంది.ఇప్పుడు ఖలేజా ఆ రికార్డును బ్రేక్ చేయనుంది.ఇందులో అనుష్క కథానాయికగా నటించగా మణిశర్మ సంగీతం అందించాడు.శింగనమల రమేష్ ,సి కళ్యాణ్ నిర్మించారు.
ఇక ఇదిలాఉంటే మహేష్ బాబు ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళితో సినిమా చేస్తున్నాడు.సైలెంట్ గా ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది.ఇప్పటివరకు ఈసినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ అఫీషియల్ గా రాలేదు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























