నటీనటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్, అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్ళై, శరత్ లోహితస్య తదితరులు
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ: హరి కె వేదాంతం
ఎడిటింగ్: చోటా కె ప్రసాద్
నిర్మాణం: శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్
నిర్మాత: కె.కె. రాధామోహన్
దర్శకత్వం: విజయ్ కనకమేడల
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధానపాత్రల్లో నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘భైరవం’. అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్ళై ఫిమేల్ లీడ్ రోల్స్ ప్లే చేశారు. ‘ఉగ్రం, నాంది’ చిత్రాల ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వంలో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ సహా ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుత స్పందన వచ్చింది.
దీంతో సినిమాపై మార్కెట్‌లో మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలో భారీ అంచనాల మధ్య భైరవం చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఇంతకూ ఈ సినిమా ఎలావుంది? ముగ్గురు హీరోలు, హీరోయిన్స్ ఉండటం కలిసొచ్చిందా? ఈ కాంబినేషన్ బిగ్ స్క్రీన్‌పై ఆడియెన్స్‌ని అలరించిందా? అలాగే ఈ వేసవి సీజన్‌లో బిగ్గెస్ట్ ఎంటర్‌టైనర్‌గా నిలిచిందా? అనేవి తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథ:-
ఒక ఊరిలోని అమ్మవారి ఆలయం చుట్టూ నడిచే కథ ఇది. వరద (నారా రోహిత్) మరియు గజపతి వర్మ (మంచు మనోజ్) మంచి స్నేహితులు. గజపతి నానమ్మ నాగరత్నమ్మ (జయసుధ) ఆ గుడికి ధర్మకర్తగా ఉంటుంది. అనాథ అయిన శ్రీను (బెల్లంకొండ సాయి శ్రీనివాస్) గజపతి దగ్గర పనిచేస్తుంటాడు. అతడికి సీను రైట్ హ్యాండ్‌లా ఉంటాడు. నాగరత్నమ్మ అనూహ్యంగా మరణించడంతో శ్రీను ధర్మకర్త అవుతాడు.
అయితే గుడిలో ఉన్న విలువైన సంపదపై దేవాదాయ శాఖ మంత్రి (శరత్ లోహితస్య) కన్ను వేస్తాడు. దీంతో గజపతితో చేతులు కలిసి ఆ ఆస్తిని వశం చేసుకోవాలి అనుకుంటాడు. అయితే ఇందుకు గజపతి ఒప్పుకున్నాడా? ఈ ప్లాన్‌కి వరద ఎలా స్పందించాడు? స్నేహితుడిని ఎవరైనా చిన్న మాట అంటేనే ఊరుకోని గజపతి, వరదా పైన ఎటాక్ జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉంటాడు? గజపతి, వరదల స్నేహం జీవితాంతం ఉంటుందా?
మంత్రి స్కెచ్‌ని శీను (బెల్లంకొండ శ్రీనివాస్) ఎలా పసిగట్టాడు? దీనిని అతడు ఎలా ఎదుర్కొన్నాడు? గజపతి భార్య నీలిమ (ఆనంది), బావమరిది పులి (సందీప్ రాజ్), వరద భార్య పూర్ణిమ (దివ్యా పిళ్లై), శ్రీను ప్రేమించిన అమ్మాయి వెన్నెల (అదితి శంకర్), సర్కిల్ ఇన్స్పెక్టర్ (సంపత్ రాజ్), నాగరాజు (అజయ్) కథలో వాళ్ళ పాత్రలు ఏమిటి? ఇంతకూ ఆలయం ఆస్తులు మంత్రి పరం అయ్యాయా? చివరికి ఏం జరిగింది? అన్నదే మిగతా కథ.
విశ్లేషణ:-
మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కిన భైరవం తమిళంలో రూపొందిన ‘గురుడన్’ సినిమాకు రీమేక్. అయితే కథగా చూస్తే.. ఇది రొటీన్‌కి భిన్నంగా ఏమీ ఉండదు. ఇందులోని కోర్ పాయింట్‌ను తీసుకొని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు,చేర్పులు చేసి తీర్చిదిద్దాడు దర్శకుడు విజయ్. హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ఇమేజ్‌లకు అనుగుణంగా పాత్రలను రూపొందించాడు.
ఇక నటీనటుల విషయానికొస్తే.. ముగ్గురు హీరోలు, ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి. మంచు మనోజ్ మంచి నటుడన్న విషయం తెలిసిందే. ఇందులో ఆయన భూపతిరాజా పాత్రలో అదరగొట్టేశాడు. యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాల్లో ఇంటెన్స్ నటనతో ఆకట్టుకున్నాడు. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ సీరియస్ కథలకి సరిగ్గా సరిపోయే కటౌట్. కళ్ళతో మంచి హావభావాలు పలికించగలిగిన నటుల్లో ఆయన ఒకరు. ఇందులోని పాత్ర ఆయనకు టైలర్ మేడ్ వంటిది. కొన్ని సీన్స్ లో అయితే శ్రీనివాస్ విశ్వరూపమే చూపించాడు.
మరోవైపు నారా రోహిత్.. విభిన్న పాత్రలలో కనిపించేందుకు ఇష్టపడే ఆయన ఈ సినిమాలో పూర్తి ఊరమాస్ క్యారక్టర్ పోషించాడు. తన సహజమైన నటనతో మెప్పించాడు. ఈ సినిమా ఆయనకు పల్లెటూరి యువకుడిగా సరికొత్త ఇమేజ్ తెచ్చిపెడుతుంది. ఇక హీరోయిన్స్ ముగ్గురూ తెరపై అందంగా కనిపించారు. కేవలం సాంగ్స్‌కే పరిమితమవకుండా కథలో వీరి పాత్రలు చాలా కీలకంగా ఉంటాయి. రోహిత్ భార్య పాత్రలో దివ్య పిళ్లై చక్కగా ఒదిగిపోయింది.
అలాగే శ్రీనివాస్ ప్రియురాలిగా అదితి శంకర్ నటన బాగుంది. మనోజ్‌కి జోడీగా నటించిన ఆనంది చక్కటి పెర్ఫార్మెన్స్ కనబరిచింది. పోలీసు అధికారిగా సంపత్ రాజ్, మినిస్టర్ దగ్గర పనిచేసే, థియేటర్ రన్ చేసే నెగెటివ్ క్యారెక్టర్‌లో అజయ్ నటన బాగుంది. ఇంకా వెన్నెల కిషోర్ కానిస్టేబుల్ పాత్రలో మంచి కామెడీ పండించాడు. అలాగే కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ పాత్ర కీలకం. వీరితోపాటు మిగిలినవారు తమ పాత్రల పరిధిమేరకు డీసెంట్‌గా నటించారు.
ఇక టెక్నికల్ పరంగా చూస్తే భైరవం హై స్టాండర్డ్స్‌లో ఉంది. శ్రీ చరణ్ పాకాల అందించిన సంగీతం సినిమాకి ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఇలాంటి కథలకు బీజీఎమ్ ఎంత ముఖ్యమో తెలిసిందే. దానికి అనుగుణంగానే చరణ్ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించాడు. కొన్ని సీన్స్‌లో అయితే బీజీఎమ్ గూజ్ బంప్స్ తెప్పించేలావుంటుంది. చాలా సన్నివేశాలను నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ చేసింది. అలాగే సాంగ్స్ లోనూ ఆయన మ్యాజిక్ కనిపిస్తుంది.
ఇంకా హరి కె వేదాంతం సినిమాటోగ్రఫీ మూవీకి మరో ఎస్సెట్. ఆయన కెమెరా పల్లెటూరి అందాలను చక్కగా ఒడిసిపట్టింది. ప్రతి ఫ్రేమ్ కలర్ ఫుల్‌గా ఉంది. అలాగే చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ చాలా షార్ప్‌గా ఉండి మూవీ ఎక్కడా బోర్ కొట్టకుండా ఉంటుంది. ఇంకా నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా వున్నాయి. స్టోరీ డిమాండ్ మేరకు నిర్మాతలు ఖర్చుకి ఎక్కడా రాజీపడలేదని అర్ధమవుతుంది.
ఇక భైరవం సినిమా కంప్లీట్ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగిపోయే యాక్షన్ థ్రిల్లర్. అయినాసరే అన్ని వర్గాల ఆడియెన్స్‌ని ఈ చిత్రం మెప్పించేలావుంది. ముగ్గురు హీరోలు, వారికి ముగ్గురు హీరోయిన్లు, వారి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. వీరికి బామ్మ (జయసుధ)కి మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్. సినిమాలోని ఈ ఎమోషనల్ పాయింట్ బాగా వర్కవుట్ అయింది. మొత్తానికి భైరవం సాలిడ్ హిట్ అని చెప్పొచ్చు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























