తెలుగు చలన చిత్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకుగానూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్’ను ఇవ్వనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే విధివిధానాలను ప్రకటించిన రేవంత్ రెడ్డి సర్కార్.. అవార్డుల ఎంపిక ప్రక్రియను చేపట్టేందుకు ప్రముఖ సీనియర్ నటి జయసుధ నేతృత్వంలో 15 మందితో కూడిన ఒక స్పెషల్ జ్యూరీని ఏర్పాటుచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మురళీ మోహన్ నేతృత్వంలోని జ్యూరీ వచ్చిన దరఖాస్తులను స్క్రీనింగ్ చేసి అవార్డులకు ఎంపిక చేసింది. 2014 జూన్ 2 నుంచి 2023 వరకూ సెన్సార్ అయిన సినిమాలను దీనికి ఎంపికచేశారు. ఈ నేపథ్యంలో నేడు టీఎఫ్‌డీసీ చైర్మన్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమక్షంలో జ్యూరీ ఛైర్మన్ మురళీ మోహన్ ప్రకటించారు. ఈ సందర్భంగా 2014 నుంచి 2023 వరకూ ఒక్కో సంవత్సరానికి ఉత్తమ చలన చిత్రానికి అవార్డును అనౌన్స్ చేశారు.
2014
- బెస్ట్ ఫిల్మ్ – రన్ రాజా రన్
- సెకండ్ బెస్ట్ ఫిల్మ్ – పాఠశాల
- థర్డ్ బెస్ట్ ఫిల్మ్ – అల్లుడు శ్రీను
2015
- ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ – రుద్రమ దేవి
- సెకండ్ బెస్ట్ ఫిల్మ్ – కంచె
- మూడో బెస్ట్ ఫిల్మ్ – శ్రీమంతుడు
2016
- ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ – శతమానం భవతి
- సెకండ్ బెస్ట్ ఫిల్మ్ – పెళ్లి చూపులు
- థర్డ్ బెస్ట్ ఫిల్మ్ – జనతా గ్యారేజ్
2017
- ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ – బాహుబలి – 2 ది కంక్లూజన్
- సెకండ్ బెస్ట్ ఫిల్మ్ – ఫిదా
- థర్డ్ బెస్ట్ ఫిల్మ్ – ఘాజీ
2018
- ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ – మహానటి
- సెకండ్ బెస్ట్ ఫిల్మ్ – రంగస్థలం
- థర్డ్ బెస్ట్ ఫిల్మ్ – కేరాఫ్ కంచరపాలెం
2019
- ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ – మహర్షి
- సెకండ్ బెస్ట్ ఫిల్మ్ – జెర్సీ
- థర్డ్ బెస్ట్ ఫిల్మ్ – మల్లేశం
2020
- ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ – అల వైకుఠపురంలో
- సెకండ్ బెస్ట్ ఫిల్మ్ – కలర్ ఫొటో
- థర్డ్ బెస్ట్ ఫిల్మ్ – మిడిల్ క్లాస్ మెలోడీస్
2021
- ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ – ఆర్ఆర్ఆర్
- సెకండ్ బెస్ట్ ఫిల్మ్ – అఖండ
- థర్డ్ బెస్ట్ ఫిల్మ్ – ఉప్పెన
2022
- ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ – సీతారామం
- సెకండ్ బెస్ట్ ఫిల్మ్ – కార్తికేయ 2
- థర్డ్ బెస్ట్ ఫిల్మ్ – మేజర్
2023
- ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ – బలగం
- సెకండ్ బెస్ట్ ఫిల్మ్ – హనుమాన్
- థర్డ్ బెస్ట్ ఫిల్మ్ – భగవంత్ కేసరి
స్పెషల్ జ్యూరీ అవార్డ్స్
స్పెషల్ అవార్డ్స్ 6
- ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ – బాలకృష్ణ
- పైడి జైడిరాజ్ అవార్డ్ – మణిరత్నం
- బిఎన్ రెడ్డి అవార్డ్ – సుకుమార్
- నాగిరెడ్డి చక్రపాణి – చందర్ రావు
- కాంతారావు అవార్డ్ – విజయ్ దేవర కొండ
- రఘుపతి వెంకయ్య అవార్డ్ – యండమూరి వీరేద్ర నాథ్
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























