గద్దర్‌ అవార్డ్స్ ప్రకటించిన TFDC చైర్మన్ దిల్ రాజు, జ్యూరీ చైర్మన్ జయసుధ

TFDC Chairman Dil Raju and Jayasudha Announce Gaddar Telangana Film Awards

తెలుగు చలన చిత్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకుగానూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ‘గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్’ను ఇవ్వనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే విధివిధానాలను ప్రకటించిన రేవంత్ రెడ్డి సర్కార్‌.. అవార్డుల ఎంపిక ప్రక్రియను చేపట్టేందుకు ప్రముఖ సీనియర్‌ నటి జయసుధ నేతృత్వంలో 15 మందితో కూడిన ఒక స్పెషల్ జ్యూరీని ఏర్పాటుచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మార్చి 13 నుంచి గద్దర్ అవార్డుల కోసం వివిధ క్యాటగిరీలలో ఎంట్రీలకు వచ్చిన నామినేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ అవార్డ్స్‌కి అన్ని కేటగిరీలకు కలిపి 1,248 నామినేషన్లు అందగా.. వీటిలో వ్యక్తిగత క్యాటగిరీలో 1172, ఫీచర్‌ ఫిలిం, బాలల చిత్రాలు, డెబిట్ చిత్రాలు, డాక్యుమెంటరీ/ లఘుచిత్రాలు, ఫిల్మ్ క్రిటిక్స్, పుస్తకాలు వంటి వివిధ క్యాటగిరీలలో 76 దరఖాస్తులు వచ్చాయి.

2014 నుంచి 2023 వరకూ ఒక్కో సంవత్సరానికి ఉత్తమ చలన చిత్రానికి అవార్డును అనౌన్స్ చేశారు. జయసుధ నేతృత్వంలోని జ్యూరీ వచ్చిన దరఖాస్తులను స్క్రీనింగ్ చేసి అవార్డులకు ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో నేడు సమాచార భవన్ లో టీఎఫ్‌డీసీ చైర్మన్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమక్షంలో జ్యూరీ చైర్మన్ జయసుధ 11 కేటగిరీలకు సంబంధించి గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను ప్రకటించారు.

2024 బెస్ట్ ఫీచర్ ఫిల్మ్స్..

  • కల్కి 2898 ఏడీ (ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్)
  • పొట్టేల్ (సెకండ్ బెస్ట్ ఫిల్మ్)
  • లక్కీ భాస్కర్ (థర్డ్ బెస్ట్ ఫిల్మ్)
  • 35: ఇది చిన్న కథ కాదు (బెస్ట్ చైల్డ్ ఫిల్మ్)
  • రజాకార్ (బెస్ట్ హిస్టారికల్ ఫీచర్ హెరిటేజ్ ఫిల్మ్)
  • ఆయ్ (బెస్ట్ పాపులర్ ఫిల్మ్)
  • కమిటీ కుర్రాళ్ళు – యధువంశీ (బెస్ట్ డెబ్యూ డైరెక్టర్)

2024 ఉత్తమ నటీనటులు..

  • బెస్ట్ హీరో – అల్లు అర్జున్ (పుష్ప-2)
  • బెస్ట్ డైరెక్టర్ – నాగ్ అశ్విన్ (కల్కి 2898 ఏడీ)
  • బెస్ట్ కమెడియన్ – సత్య, వెన్నెల కిషోర్ (మత్తు వదలరా 2)
  • బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – ఎస్. జె సూర్య (సరిపోదా శనివారం)
  • బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ – శరణ్యా ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)
  • బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్స్ – మాస్టర్ అరుణ్ దేవ్ (35: ఇది చిన్న కథ కాదు), బేబీ హారిక
  • బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – బీమ్స్ (రజాకార్)
  • బెస్ట్ సింగర్ మేల్ – సిద్ శ్రీరామ్ (ఊరి పేరు భైరవకోన)
  • బెస్ట్ సింగర్ ఫిమేల్ – శ్రేయ ఘోషల్ (పుష్ప 2)
  • బెస్ట్ కొరియోగ్రాఫర్ – గణేష్ ఆచార్య (దేవర)
  • బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ – చంద్రశేఖర్
  • బెస్ట్ లిరిక్ రైటర్ – చంద్రబోస్ (రాజూ యాదవ్)
  • బెస్ట్ స్టోరీ రైటర్ – శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)
  • బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ – వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)

2024 స్పెషల్ జ్యురీ అవార్డ్స్

బెస్ట్ యాక్టర్ – దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్)
బెస్ట్ యాక్ట్రెస్ – అనన్య నాగళ్ళ (పొట్టేల్)
బెస్ట్ డైరెక్టర్ – సుజీత్, సందీప్ (క)
బెస్ట్ ప్రొడ్యూసర్స్ – ప్రశాంత్ రెడ్డి, రాజేశ్ కల్లెపల్లి (రాజూ యాదవ్)
స్పెషల్ మెన్షన్ – ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా 2)
బెస్ట్ బుక్ @ తెలుగు మూవీస్ – మన సినిమా ఫస్ట్ రీల్ (రెంటాల జయదేవ్)

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.