మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’. ‘మనదే ఇదంతా’ అనేది ట్యాగ్ లైన్. రవితేజకు ఇది 75వ చిత్రం కావడం విశేషం. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. రవితేజ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన మూవీ గ్లింప్స్‌కి సూపర్ రెస్పాన్స్ వచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మాస్ జాతరకి సంబంధించి కీలక అప్‌డేట్ అందించింది చిత్ర యూనిట్. ఈ చిత్రం ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలిపింది. ఈ మేరకు నేడు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.
కాగా మాస్ జాతరలో రవితేజ రైల్వే పోలీస్ ఆఫీసర్‌గా పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తుండగా.. విధు అయ్యన్న సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమా తరువాత కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నాడు రవితేజ. ‘దసరా’ నిర్మాత చెరుకూరి సుధాకర్ ప్రొడ్యూస్ చేయనున్నారు. దీనితోపాటు ‘మ్యాడ్ స్క్వేర్’ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఒక సోషియో ఫాంటసీ మూవీ కూడా చేయనున్నాడు. ఈ సినిమాను కూడా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థే నిర్మించనుండటం గమనార్హం.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























