చాలా గ్యాప్ తరువాత రీసెంట్ గా ప్రతినిధి 2 తో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు హీరో నారా రోహిత్ . గత ఏడాది వచ్చిన ఈసినిమా పూర్తిగా నిరాశపరిచింది. ఇక ఈసినిమా తరువాత రోహిత్ భైరవం అనే సినిమా చేశాడు.ఇందులో సాయి శ్రీనివాస్ ,మనోజ్ లతో కలిసి చేశాడు. ఈసినిమా ఈనెల 30న విడుదలకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నారా రోహిత్ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. అదేంటంటే పుష్ప సినిమాలోని భన్వర్ లాల్ పాత్ర కోసం మిమ్మల్ని అనుకున్నారట నిజమేనా అని అడిగిన ప్రశ్నకు నారా రోహిత్ సమాధానమిచ్చాడు.అవును నిర్మాత మైత్రి రవి గారు నాతో డిస్కస్ చేశారు.తరువాత సుకుమార్ గారు కూడా మాట్లాడారు. అయితే క్రమంగా సినిమా స్పాన్ పెరిగిపోవడంతో అది కాస్త ఫహాద్ ఫాజిల్ దగ్గరికి వెళ్ళింది.ఫహద్ చాలా బాగా చేశాడు. నేను అలా చేసేవాడికానిదేమో అని అన్నాడు.
ఒకవేళ ఆ పాత్ర రోహిత్ చేసి ఉంటే కెరీర్ కు మంచి హెల్ప్ అయ్యివుండేదే.ఇక నారా రోహిత్ సోలో హీరోగా సుందరకాండ అనే సినిమా చేస్తున్నాడు. షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే.అన్ని కుదిరితే జూలై లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. కొత్త దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈసినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తుండగా సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్ పై సంతోష్ చిన్నపొల్ల,గౌతమ్ రెడ్డి,రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























