ఈనెల 1న విడుదలై ఈఏడాది కోలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది టూరిస్ట్ ఫ్యామిలీ.చిన్న సినిమా గా వచ్చి ఏకంగా 80 కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.ఒక్క తమిళనాడులోనే 50కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పటికీ ఈసినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి స్థానంలో కొనసాగుతుంది.అయితే ఈసినిమా ఈరోజే ఓటిటి లోకి రావాల్సివుండగా థియేట్రికల్ రన్ కోసం వాయిదావేశారు. ఇక ఈరోజు మరో డేట్ ను ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జూన్ 2న ఈసినిమా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ లోకి రానుంది.అయితే కేవలం ఒరిజినల్ వెర్షన్ తమిళంలోనే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో అందుబాటులోకి రానుంది. మరి మిగితా భాషల్లో ఎప్పుడొస్తుందో క్లారిటీ రావాల్సివుంది. తెలుగు ప్రేక్షకులు ఈసినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక టూరిస్ట్ ఫ్యామిలీ అగ్ర దర్శకుడు రాజమౌళి అలాగే నేచురల్ స్టార్ నానినికూడా మెప్పించింది.ఈసినిమా చూసి వీరిద్దరూ టూరిస్ట్ ఫ్యామిలీ టీంను ఎక్స్ ద్వారా అభినందించారు.అభిషన్ జీవింత్ డైరెక్షన్ లో బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో ప్రముఖ నటుడు శశి కుమార్ ,సిమ్రాన్ ,మిథున్ జై శంకర్ ,కమలేష్,యోగ లక్ష్మి లీడ్ రోల్ లో నటించగా సీన్ రోనాల్డ్ సంగీతం అందించాడు.మిలియన్ డాలర్ స్టూడియోస్ ,ఎమ్ ఆర్ పి ఎంటర్టైన్మెంట్ నిర్మించాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























