భైరవం కంటెంట్ చాలా నచ్చింది – డైరెక్టర్ అనిల్ రావిపూడి

Director Anil Ravipudi talks at Bhairavam's pre-release event

విజయ్ కనకమేడల డైరెక్షన్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటించిన సినిమా భైరవం.ట్రైలర్ తో సినిమాకు హైప్ వచ్చింది. ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు.కెకె రాధామోహన్ ఈసినిమాను నిర్మించారు. ఈనెల 30న థియేటర్లలోకి వస్తుంది.సోలోగా విడుదలకావడం సినిమాకు అడ్వాంటేజ్ కానుంది. ఇక ఆదివారం ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెన్ జరిగింది. దీనికి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా విచ్చేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. అందరికీ నమస్కారం.ఈ సినిమా టీమ్ అందరితో నాకు మంచి రిలేషన్ ఉంది. డైరెక్టర్ విజయ్ నాకు చాలా మంచి ఫ్రెండ్. ఈ సినిమా కంటెంట్ నాకు చూపించారు. చాలా అద్భుతంగా ఉంది. యాక్షన్ సినిమాలు చూసే వారందరికీ కూడా ఇది సూపర్బ్ వైబ్ ఇస్తుంది. తప్పకుండా విజయ్ పెద్ద హిట్ కొడతాడు. మనోజ్ గారు రోహిత్ గారు శీను గారు చాలా మంచి యాక్టర్స్. మనోజ్ గారు చిన్నప్పుడు నుంచి చాలా మంచి క్యారెక్టర్స్ చేశారు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఈ సినిమాతో కం బ్యాక్ ఇస్తున్నారు. ఈ సినిమాతో తన టైం స్టార్ట్ అయింది. రోహిత్ గారు సెటిల్ పెర్ఫార్మర్. ఆయన కెరీర్ లో కూడా ఈ సినిమా వన్ అఫ్ ది బెస్ట్ ఫిల్మ్ అవుతుంది.

శ్రీనివాస్ గారు మై బ్రదర్. బెల్లంకొండ సురేష్ గారి కందిరీగ సినిమాలో నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాను. అప్పటినుంచి వారితో పరిచయం ఉంది. శీను చాలా హైపర్. చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. ఖచ్చితంగా తను మంచి హీరో అవుతాడు అనుకున్నాను అలానే ఇప్పుడు బాలీవుడ్ లో ఇక్కడ అన్నిచోట్ల ఎక్స్ట్రార్డినరీగా బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఈ సినిమా తన కెరీర్ లో మరో మంచి సినిమాగా నిలుస్తుంది.ముగ్గురు హీరోలు కలిసి చేస్తున్నప్పుడు ముందుగా పక్కన పెట్టాల్సింది ఈగో. అది పక్కనపెట్టి ఈ సినిమా చేసినట్లుగా అనిపిస్తుంది. ప్రమోషన్స్ లో చాలా కలిసిపోయి ఒక బ్రదర్స్ లాగా వర్క్ చేస్తున్నారు. ఖచ్చితంగా అది సినిమా కూడా ప్లస్ అవుతుంది. సినిమా యూనిట్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.