పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన మచ్ అవైటెడ్ మూవీ ‘హరిహర వీరమల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం రీ-రికార్డింగ్, డబ్బింగ్ మరియు VFX పనుల్లో బిజీగా ఉంది. జూన్ 12న విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడిన నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టేసిన మేకర్స్ ఇప్పటికే మూడు పాటలు రిలీజ్ చేయగా, మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. రేపు వీరమల్లు నుంచి నాలుగో సింగిల్ రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో పవన్ నటిస్తోన్న మరో చిత్రం ‘ఓజీ’ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టారు. “ముందు వీర.. తర్వాత గంభీర.. హరిహర వీరమల్లు సినిమాను వీక్షించేందుకు వేచిఉండలేకపోతున్నాం” అని అందులో పేర్కొన్నారు. దీనికి స్పందించిన వీరమల్లు మేకర్స్ తమ చిత్రాన్ని సపోర్ట్ చేస్తున్నందుకు ఓజీ నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పారు. కాగా ‘ఓజాస్ గంభీర’ అనేది ఓజీలో పవన్ కళ్యాణ్ పేరు కావడం గమనార్హం.
కాగా హరిహర వీరమల్లులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే అనుపమ్ ఖేర్, నాజర్, రఘుబాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాకి యువ దర్శకుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మించారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో విడుదల కానుంది.
ఇక ముంబై బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతోన్న ‘ఓజీ’ సినిమాకు ‘సాహో’ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సాంగ్స్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత దానయ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























