ఓజీ.. రిలీజ్ డేట్ ఫిక్స్

Power Star Pawan Kalyan's OG Release Date Announced

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘హరి హరవీరమల్లు’, ‘ఓజీ’ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆయన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా చిత్రాల మేకర్స్ పలు అప్‌డేట్స్ వెల్లడిస్తూ ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ క్రమంలో తాజాగా ‘ఓజీ’ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. పవర్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. హరి హరవీరమల్లు జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఇప్పుడు ఓజీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 25న గ్రాండ్ గా విడుదల చేయనున్నట్టు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ వరుస అప్డేట్స్ తో పవన్ ఫ్యాన్స్ ఆనందానికి హద్దే లేకుండా పోయింది.

కాగా ముంబై బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ‘ఓజీ’ సినిమాకు ‘సాహో’ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత దానయ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.