మాస్ రాజా రవితేజ నటిస్తున్న 75వ సినిమా మాస్ జాతర.మనదే ఇందంతా అనేది ట్యాగ్ లైన్. ఈ ల్యాండ్ మార్క్ మూవీని భాను భోగవరపు తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్ విషయానికి వస్తే ప్రస్తుతం సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు.ఇందుకోసం స్పెషల్ సెట్ వేశారు.ఈనెల చివరి కల్లా షూటింగ్ అంతా కంప్లీట్ కానుంది. ఆ తరువాత జూన్ లో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి జులై లో రిలీజ్ చేయనున్నారు.షూటింగ్ కంప్లీట్ అవ్వగానే వరుసగా అప్డేట్స్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.రీసెంట్ గా ఈ సినిమా నుండి సాంగ్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మాస్ జాతరలో రవితేజ రైల్వే పోలీస్ ఫోర్స్ ఆఫీసర్ గా కనిపించనుండగా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.నాగవంశీ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.రవితేజ మార్క్ ఎంటర్టైనర్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు భాను భోగవరపు.ఈసినిమాతో రవితేజ హిట్ కొట్టి కం బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు.
ఇక ఈసినిమాను కంప్లీట్ చేసి రవితేజ బ్రేక్ తీసుకోకుండా వెంటనే తన నెక్స్ట్ సినిమాను మొదలు పెట్టనున్నాడు.అందులో భాగంగా తన 76వ సినిమాను చిత్ర లహరి ఫేమ్ కిషోర్ తిరుమల డైరెక్ట్ చేయనుండగా సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు.ఇందులో డ్రాగన్ ఫేమ్ కయాదు లోహర్ ను హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నారు. త్వరలోనే ఈసినిమా అఫిషియల్ గా లాంఛ్ కానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























