మూడేళ్ళ క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బిగెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది కన్నడ సినిమా కాంతార.ఒక్క కన్నడ లోనే కాదు తెలుగు , హిందీ భాషల్లో కూడా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఇక ఫస్ట్ పార్ట్ కు ఊహించని రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు దీనికి సీక్వెల్ కూడా వస్తుంది.ఈ సీక్వెల్ కు కాంతార చాప్టర్ 1 టైటిల్ ను ఫిక్స్ చేయగా దాదాపు 100కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది.ఇక ఇంతకుముందే అక్టోబర్ 2న విడుదలకానుందని కూడా ప్రకటించారు. అయితే ఈ రిలీజ్ డేట్ మారనుందని విడుదల వాయిదా పడుతుందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక దీని పై స్పందించింది కాంతార టీం.షూటింగ్ అనుకున్న ప్రకారం సాగుతుంది.రిలీజ్ డేట్ మారుతుందని వస్తున్న వార్తల్లో నిజం లేదు. కాంతార చాప్టర్ 1 చెప్పినట్లుగా అక్టోబర్2 నే రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చింది.త్వరలోనే ఈసినిమా నుండి అప్డేట్ ఇవ్వనుంది.రిషబ్ శెట్టి నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాకు అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తుండగా హోమ్ బలే ఫిలిమ్స్ నిర్మిస్తుంది.
ఇక రిషబ్ శెట్టి ప్రస్తుతం తెలుగులో జై హనుమాన్ లో కూడా నటిస్తున్నాడు.హనుమాన్ కు సీక్వెల్ గా ప్రశాంత్ వర్మ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























