రెబల్ స్టార్ ప్రభాస్ కు బ్రేక్ ఇచ్చిన సినిమా వర్షం. 2004లో వచ్చిన ఈసినిమా సూపర్ వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఈసినిమాతో ప్రభాస్ కెరీర్ టర్న్ అయ్యింది. ప్రభాస్ కటౌట్ ,నటన , గోపిచంద్ విలనిజం ,దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాలో నెక్స్ట్ లెవల్ అనిపించాయి.ఇక ఈసినిమా ఇప్పటి వరకు రెండు సార్లు రీ రిలీజ్ అవ్వగా ఈరోజు మరోసారి థియేటర్లలోకి వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే కేవలం అడ్వాన్స్ సేల్స్ తోనే కోటి రూపాయల మార్క్ ను దాటింది.థర్డ్ రీ రిలీజ్ లో ఈ ఫీట్ సాధించడం అంటే మాములు విషయం కాదు. ప్రస్తుతం కొత్త సినిమాలు ఏవి లేకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది వర్షం.దాంతో మొదటి రోజు దాదాపు 2 కోట్లకుపైనే వసూళ్లను రాబట్టుకునే ఛాన్స్ వుంది. మరి ఫుల్ రన్ లో ఏమేరకు రాబడుతుందో చూడాలి.లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా శోభన్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో త్రిష కథానాయికగా నటించగా ఎమ్ ఎస్ రాజు నిర్మించారు.
ఇక ప్రభాస్ ప్రస్తుతం రెండు సినిమలతో బిజీగా వున్నాడు.అందులో ఒకటి ది రాజాసాబ్ కాగా మరొకటి హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరక్కుతున్న సినిమా. ఇందులో ది రాజాసాబ్ ను మారుతి డైరెక్ట్ చేస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఈఏడాది చివర్లో రిలీజ్ చేయనున్నారు.ఇక హను రాఘవపూడితో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తున్నాడు ప్రభాస్.ఇందులో ఇమాన్వి కథానాయికగా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























