ఈ సంవత్సరం సినీప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘థగ్ లైఫ్’ ఒకటి. కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ నేషనల్ వైడ్‌గా సెన్సేషన క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో నితిన్ ఫాదర్ ఎన్ సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. గతంలో విక్రమ్, అమరన్ లాంటి బ్లాక్‌బస్టర్స్ అందించిన ఈ సంస్థ ఇప్పుడు థగ్ లైఫ్ సినిమాను కూడా భారీ స్థాయిలో విడుదల చేయబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ హైదరాబాద్‌లో మీడియా మీట్ నిర్వహించారు.
హీరోయిన్ త్రిష మాట్లాడుతూ… అందరికి నమస్కారం. నాకు హైదరాబాద్ సెకండ్ హోమ్ ఇక్కడికి ఎప్పుడు వచ్చినా చాలా ఆనందంగా ఉంటుంది. నాకు ఇంత సపోర్ట్ ఇచ్చిన తెలుగు ఆడియన్స్ అందరికీ థాంక్యూ. ఈ సినిమా ఒక బ్యూటిఫుల్ జర్నీ. నేను నాయకుడు సినిమా చూస్తూ పెరిగాను. ఇప్పుడు మణిరత్నం గారు కమలహాసన్ గారితో కలిసి వర్క్ చేసే అవకాశం రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. తప్పకుండా ఈ సినిమా మీ అందరిని అలరిస్తుంది.” అని చెప్పారు.
అలాగే చిత్రంలో కీలక పాత్రను పోషించిన నటి అభిరామి మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఒక మంచి సినిమా వస్తే తెలుగు ప్రేక్షకుల సపోర్ట్ వేరే లెవల్. మీ ప్రేమకి కృతజ్ఞతలు. ఈ సినిమా నాకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. మణిరత్నం గారు, కమల్ హాసన్ గారు, ఏఆర్ రెహమాన్ గారు, శింబు గారు ఇలాంటి లెజెండ్స్‌తో వర్క్ చేయడం ఒక డ్రీమ్. ఈ సినిమాతో చాలా విషయాలు నేర్చుకున్నాను. ఒక యాక్టింగ్ స్కూల్ కి వెళ్లి వచ్చిన ఫీలింగ్ ఉంది. మీరందరూ చాలా ప్రేమతో ఈ సినిమా చేసాం. మీరందరూ కూడా థియేటర్స్ లో చూసి సినిమాని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను.” అని తెలిపారు.
ఇంకా సీనియర్ నటి సుహాసిని మణిరత్నం మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. నేను ఇక్కడికి వస్తే ఒక పుట్టింటికి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. మళ్ళీ మళ్ళీ ఇలాంటి రోజు రాదు. ద బెస్ట్ టాలెంట్ కలిసి ఒక సినిమాతో మీ ముందుకు వస్తున్నారు. ప్రేక్షకుల మీద చాలా ప్రేమతో చేసిన సినిమా ఇది. ఆడియన్స్ కూడా అంత గొప్పగా ఆదరిస్తారని నమ్మకం ఉంది. సినిమాలో అందరూ అదరగొట్టేసారు. ఈ సినిమా కోసం మీలానే జూన్ 5 కోసం ఒక ఆడియన్ లాగా ఎదురుచూస్తున్నాను” అని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























