బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీడియోల్ ,టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన సినిమా జాట్.మార్చి లో థియేటర్లోకి వచ్చిన ఈసినిమా 100 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి హిట్ అనిపించుకుంది.ఇక ఈసినిమా ఓటిటిలోకి రానుంది.జూన్ 5న నెట్ ఫ్లిక్స్ హిందీ తోపాటు మిగితా భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.మరి థియేటర్లలో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈసినిమా ఓటిటి లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో రణదీప్ హూడా విలన్ పాత్రలో కనిపించగా రెజీనా కసాండ్రా ,సయామి ఖేర్, రమ్యకృష్ణ ,జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు.తమన్ సంగీతం అందించాడు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ,మైత్రి మూవీ మేకర్స్ నిర్మించాయి. హిందీలో ఇదే వీరికి మొదటి సినిమా.
ఇక జాట్ హిట్ కావడంతో దీనికి సీక్వెల్ కూడా రానుంది.రీసెంట్ గా అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది.అయితే ఇప్పుడప్పుడే ఈసినిమా మొదలయ్యే అవకాశాలు కనిపించడంలేదు.ఎందుకంటే గోపిచంద్ మలినేని నెక్స్ట్ బాలకృష్ణతో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.ఈసినిమా కంప్లీట్ చేశాక జాట్ 2 ను మొదలు పెట్టనున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























