జూనియర్‌లో శ్రీలీల పెర్ఫార్మెన్స్ అమేజింగ్ – దేవిశ్రీ

Devisri Prasad Praises Junior Movie Hero Kireeti and Actress Sreeleela

కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న మూవీ ‘జూనియర్’. వారాహి చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాధా కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రంలో టాప్ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అలాగే ఈ సినిమాతో జెనీలియా మళ్లీ రీఎంట్రీ ఇస్తుండగా.. కన్నడ సినిమా ఐకాన్, క్రేజీ స్టార్ డాక్టర్ రవిచంద్రన్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా జూన్ 18న తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది. ఈ సినిమా మ్యూజికల్ జర్నీని ప్రారంభిస్తూ తాజాగా ఫస్ట్ సింగిల్ ‘లెట్స్ లివ్ దిస్ మోమెంట్’ను విడుదల చేశారు మేకర్స్.

ఇక ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఒక లైవ్ కాన్సర్ట్ చేస్తున్న ఆనందం కలిగింది ఈ వేడుక చూస్తుంటే. ఈ సినిమాలో పార్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ రాధాకృష్ణ గారు సినిమాని చాలా ప్రత్యేకంగా తీశారు. స్క్రిప్ట్ చాలా యూనిక్‌గా ఉంటుంది. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. వెరీ ఎమోషనల్ అండ్ టచ్చింగ్ స్టోరీ.”

“శ్రీమణి గారు చాలా అద్భుతమైన సాహిత్యం రాశారు. ట్యూన్‌కి బ్యూటీని యాడ్ చేశారు.సెంథిల్ గారు ఈ సినిమాకి వర్క్ చేయడం మరో హ్యాపీ మూమెంట్. ఈ సినిమాకి ఆయన బిగ్గెస్ట్ పిల్లర్. రవిచంద్రన్ గారు ఈ సినిమాల్లో పార్ట్ కావడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. రవిచంద్రన్ గారి తెలుగు చాలా అందంగా ఉంది. తెలుగు వర్షన్‌కి ఆయనే డబ్బింగ్ చెప్పాలని కోరుకుంటున్నాను. సాయిగారి బ్యానర్‌లో వర్క్ చేయడం ఒక హానర్‌గా భావిస్తున్నాను.”

“కిరీటి సినిమా కోసం చాలా అద్భుతంగా ప్రిపేర్ అయ్యారు. తన యాక్షన్, డాన్సింగ్ స్కిల్స్ చాలా సర్‌ప్రైజ్‌ చేశాయి. ఫైట్స్ చాలా అద్భుతంగా చేశాడు. తనకి గ్రేట్ ఫ్యూచర్ ఉంటుంది. జెనీలియా ఈ సినిమాతో మళ్ళీ కం బ్యాక్ ఇవ్వడం ఆనందంగా ఉంది. శ్రీలీల అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. ఇందులో ఎనర్జిటిక్ సాంగ్ ఉంది. అది మిమ్మల్ని అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా తప్పకుండా మీ అందరిని అలరిస్తుంది” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.