ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా యువ దర్శకుడు మహేష్ బాబు పి తెరకెక్కిస్తున్న సినిమా ‘RAPO 22’ (వర్కింగ్ టైటిల్). మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. కొన్ని రోజులు క్రితం సాగర్‌గా రామ్, మహాలక్ష్మిగా భాగ్య శ్రీ బోర్సే క్యారెక్టర్ లుక్స్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
క్యూట్ లవ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్‌లో పూర్తయింది. రామ్, ఇంకా ఇతర ప్రధాన తారాగణం మీద కీలక సన్నివేశాలు తీశారు. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ మొదలవనుంది. ఇక రీసెంట్గా సీనియర్ స్టార్ నటుడు ఉపేంద్ర ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు ప్రకటించి సర్ప్రైజ్ చేశారు మేకర్స్.
ఈ నేపథ్యంలో నేడు హీరో రామ్ జన్మదినం సందర్భంగా ‘RAPO 22’ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. దీనికి ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇందులో రామ్, హీరో ఉపేంద్ర అభిమానిగా ఊర మాస్ లుక్‌లో కనిపించాడు. ఈ టైటిల్ గ్లింప్స్ అయితే సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. అయితే గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్ పోతినేని ఈ సినిమాతో గట్టిగా కొట్టేలా కనిపిస్తున్నాడు.
కాగా ఈ చిత్రానికి మధు నీలకందన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. తమిళ మ్యూజిక్ ద్వయం వివేక్ -మెర్విన్ సంగీతం సమకూరుస్తున్నారు. అలాగే అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనింగ్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. ఇక ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రాన్ని ఈ సెప్టెంబర్‌లో కానీ, లేదంటే దసరా కానుకగా కానీ థియేటర్లలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























