టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కింగ్‌డమ్’ ప్రస్తుతం సెట్స్ పైన ఉంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా.. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ మూవీ టీజర్ విడుదల చేయగా, సూపర్ రెస్పాన్స్ అందుకుంది. సమ్మర్ కానుకగా కింగ్‌డమ్ సినిమాను మే 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోవైపు యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్‌లో రూపొందనున్న చిత్రంలో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు. ప్రస్తుతానికి దీనిని ‘#VD14’ అనే వర్కింగ్ టైటిల్‌తో వ్యవహరిస్తున్నారు. కాగా నేడు హీరో విజయ్ దేవరకొండ జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా VD14 నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. పోస్టర్ అయితే అదిరిపోయింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఇంతకుముందెన్నడూ కనిపించని లుక్‌లో కనిపించబోతున్నట్టు అర్ధమవుతోంది.
కాగా ఇంతకుముందు రాహుల్ ‘టాక్సీవాలా’, ‘శ్యామ్ సింగ్ రాయ్’ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఈ రెండూ సూపర్ హిట్ సాధించాయి. దీంతో ఇప్పుడు తీయబోయే సినిమాపైనా భారీ అంచనాలే ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతుండటం విశేషం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.
కాగా ఈ చిత్రంలో హాలీవుడ్ యాక్టర్, ‘ది మమ్మీ’ ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ విలన్‌గా కనిపించనున్నాడు. అలాగే పలువురు హాలీవుడ్ టెక్నీషియన్స్ తమ సహకారం అందించనున్నారు. ఇక హిందీ సంగీత ద్వయం అజయ్- అతుల్ సంగీతం అందించనున్నారు త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలవనుండగా.. ఇందులో నటించనున్న నటీనటులు మరియు టెక్నిషియన్ల వివరాలను మరికొన్ని రోజుల్లో వెల్లడించనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























