మెగాస్టార్ చిరంజీవి-శ్రీదేవి జంటగా నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ 1990 మే9న విడుదలైన బాక్సాఫీస్ వద్ద అఖండ విజయాన్ని అందుకుంది. వైజయంతీ మూవీస్ అశ్వనీదత్ నిర్మాణంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఎవర్‌గ్రీన్ క్లాసిక్. మే 9వ తేదీతో ఈ సినిమా విడుదలై 35ఏళ్లు అవుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా ఈ సినిమాని నేడు గ్రాండ్‌గా రిలీజ్ చేశారు మేకర్స్. 35 ఏళ్ల క్రితం మే 9న విడుదలై సంచలన విజయం సాధించిన ఈ చిత్రాన్ని మళ్ళీ అదే మే9న రీరిలీజ్ చేయడం విశేషం. 2డీతో పాటు, 3డీలోనూ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మరో హైలెట్. తెలుగు సినిమా చరిత్రలోనే ఎవర్‌గ్రీన్ క్లాసిక్, మైల్ స్టోన్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి.
ఈ క్రమంలో జగదేక వీరుడు అతిలోక సుందరి ప్రదర్శించబడుతున్న థియేటర్ల వద్ద ఈ ఉదయం నుంచే మెగా ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. దీంతో ఆయా థియేటర్ల వద్ద సందడి నెలకొంది. తమ అభిమాన హీరో సినిమా ప్రదర్శించబడుతున్న సందర్భంగా మెగా ఫ్యాన్స్ డప్పు చప్పుళ్ళు, టపాసుల మోతతో సంబరాలు చేసుకుంటున్నారు.
కాగా చిరు- శ్రీదేవిల నటన, రాఘవేంద్రరావు దర్శకత్వ ప్రతిభ, నిర్మాత అశ్వనీదత్ విజన్, మేస్ట్రో ఇళయరాజా సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. నిర్మాత అశ్వనీదత్ సినిమాపై ఉన్న ప్యాషన్‌తో అప్పటివరకూ ఎవరూ ఖర్చు చేయలేనంత భారీ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ప్రేక్షకులు గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తూ హిస్టారికల్ సక్సెస్ సాధించింది.
ఇక ఇప్పుడు రీరిలీజ్ లో 2డీతో పాటు, 3డీలోనూ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు మరోస్థాయికి చేరుకున్నాయి. జగదేక వీరుడు అతిలోక సుందరిని అప్పట్లోనే విజువల్ వండర్‌గా తీశారు. త్రీడీ వెర్షన్ ఇప్పటి ఆడియన్స్‌కి న్యూ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























