డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ వుంది. ఖైదీతో గుర్తింపుతెచ్చుకున్న ఈ డైరెక్టర్ విక్రమ్ , లియో తో బ్రాండ్ గా మారిపోయాడు.తన నుండి వస్తున్న సినిమాలకు తమిళంలో ఎంత బజ్ వుందో తెలుగులోనూ అంతే బజ్ క్రియేట్ చేసుకోగలిగాడు.ఇక లోకేష్ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా కూలీ. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తుండగా కింగ్ నాగార్జున పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యినట్లే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రెండు రోజుల క్రితం100 డేస్ టు గో అంటూ కూలీ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇందులో రజినీకాంత్ ,నాగార్జున ,ఉపేంద్ర ,సత్యరాజ్ ,సౌబిన్ షాహిర్ ల లుక్ పూర్తిగా రివీల్ చేయకుండా వెనుక నుంచి చూపెట్టారు.అనిరుధ్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. ముఖ్యంగా ఈ గ్లింప్స్ లో నాగ్ బ్యాక్ షాట్ కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.సినిమాలో నాగార్జున ను లోకేష్ ఎలా చూపిస్తాడో అనే ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. ఓవరాల్ గా ఒక్క గ్లింప్స్ తో సినిమా మీద వున్న అంచనాలు డబుల్ చేశారు.
కూలీలో శృతి హాసన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తుంది.సన్ పిక్చర్స్ ఈసినిమాను నిర్మిస్తుండగా ఆగస్టు 14న రిలీజ్ కానుంది.అయితే అదే డేట్ కి హృతిక్ రోషన్ , ఎన్టీఆర్ ల వార్ 2 కూడా థియేటర్లలోకి వస్తుంది.దాంతో తెలుగు, హిందీలో కూలీకి భారీ పోటీఎదురుకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























