టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అభిమానులకు గుడ్ న్యూస్ వినిపించారు. త్వరలో ఆయన తండ్రిగా ప్రమోషన్ అందుకోనున్నారు. ఈ మేరకు విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. తాజాగా వరుణ్ తేజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో పంచుకున్నారు. అందులో వరుణ్, తన సతీమణి లావణ్య త్రిపాఠి చేయిచేయి కలిపి బేబీ షూస్ పట్టుకుని ఉన్నట్టుగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీంతో ఈ సెలబ్రిటీ జంట త్వరలోనే తమ తొలి బిడ్డకు జన్మనివ్వనున్నట్టు అర్ధమవుతోంది. వరుణ్ షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇక విషయం తెలిసిన ఫ్యాన్స్, నెటిజన్స్ ఈ స్టార్ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరోవైపు మెగాభిమానులు ఈ దంపతులకు కంగ్రాట్స్ చెబుతున్నారు. మెగా ఫ్యామిలీ లోకి త్వరలో కొత్త మెంబర్ వస్తున్నారంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా వరుణ్ తేజ్ మరియు హీరోయిన్ లావణ్య త్రిపాఠిల వివాహం 2023, నవంబర్ 1న ఇటలీలోని టస్కానీలో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. సంప్రదాయబద్ధంగా పూర్తి భారతీయ శైలిలో జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు వరుణ్ తేజ్ తల్లిదండ్రులు కొణిదెల నాగబాబు దంపతులు సహా మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు, మెగా-అల్లు కుటుంబ సభ్యులు హాజరై అక్షింతలతో నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఇక వరుణ్ తేజ్ సినిమాల విషయానికొస్తే, ఆయన ప్రస్తుతం #VT15 (వర్కింగ్ టైటిల్) అనే మూవీలో నటిస్తున్నారు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ ఫేమ్ మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇండో-కొరియన్ హారర్ కామెడీ జానర్లో ఎమోషన్స్, థ్రిల్స్ రోలర్-కోస్టర్ రైడ్‌గా ఉండబోతోంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























