పర్‌ఫెక్ట్ రన్ టైంతో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. బ్లైండ్ స్పాట్

Blind Spot Movie Locks Perfect Run Time

ట్యాలెంటెడ్ హీరో నవీన్ చంద్ర ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘బ్లైండ్ స్పాట్’. నూతన దర్శకుడు రాకేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో రామకృష్ణ వీరపనేని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, థియేట్రికల్ ట్రైలర్, ‘కనిపించేవన్నీ’ లిరికల్ వీడియో సాంగ్‌.. సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈసినిమా  మే 9న ప్రేక్షకుల థియేటర్లలోకి వస్తోంది.ఈ నేపథ్యంలో ఎక్సైట్‌మెంట్‌ని మరింత పెంచేస్తూ తాజాగా బ్లైండ్ స్పాట్ చిత్రం నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు మేకర్స్. ఈ మూవీకి అతితక్కువ రన్ టైం లాక్ చేశారు. ఎండ్ టైటిల్స్‌తో కలుపుకుని మొత్తం 1గం 31ని.ల రన్ టైంని ఫిక్స్ చేశారు. ఇది సినిమాకి కలిసొచ్చే అంశం.

సాధారణంగా మన ఇండియన్ సినిమాలు దాదాపుగా 2:30 గంటల నిడివి కలిగివుంటాయి. హాలీవుడ్ సహా విదేశీ సినిమాలు ఇలా తక్కువ నిడివితో వస్తుంటాయి. ఇదే తరహాలో ఇప్పుడు బ్లైండ్ స్పాట్ కూడా కేవలం గంటన్నర రన్ టైంతో వస్తోంది. పక్కా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఫార్మాట్‌లో, ఎలాంటి అనవసరమైన సన్నివేశాలు లేకుండా క్రిస్పీ ఎడిటింగ్‌తో పర్‌ఫెక్ట్ రన్ టైంతో వస్తోంది. ఇది ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్ అందించడం పక్కా.

బ్లైండ్ స్పాట్ లో రాశి సింగ్ హీరోయిన్‌గా నటించగా.. బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా, రవి వర్మ, గాయత్రి భార్గవి, కిషోర్ కుమార్, హారిక పేడాడ, హర్ష రోషన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రీరామ్ మద్దూరి సంగీతం అందించగా.. దర్శన్ ఎమ్ అంబట్ సినిమాటోగ్రఫీ, సత్య. జి ఎడిటింగ్ నిర్వహించారు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ చేస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.