రాజ్ తరుణ్ ‘పాంచ్ మినార్’ నుంచి లవ్లీ సాంగ్ రిలీజ్

Janu Meri Janu Lyrical Video Released From Raj Tarun's Paanch Minar

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ ప్రధానపాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పాంచ్ మినార్’. క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు రామ్ కడుముల దర్శకత్వం వహిస్తున్నాడు. గోవింద రాజు ప్రజెంట్ చేస్తున్న ఈ చిత్రాన్ని కనెక్ట్ మూవీస్ LLP బ్యానర్ పై మాధవి, MSM రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ సాంగ్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ పాంచ్ మినార్ నుండి ‘జాను మేరి జాను’ అనే సాంగ్ ని రిలీజ్ చేశారు. స్టార్ కంపోజర్ శేఖర్ చంద్ర ఈ సాంగ్ ని క్యాచి ట్యూన్ గా కంపోజ్ చేశారు. వినాయక్ ఈ పాటని ఎనర్జిటిక్ గా పాడారు. శ్రీ హర్ష ఈమని రాసిన లిరిక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సాంగ్ లో రాజ్ తరుణ్, రాశి సింగ్ కెమిస్ట్రీ ఇంట్రస్టింగ్ గా వుంది. ఈ సాంగ్ ఇన్స్టంట్ హిట్ గా నిలిచింది.

ఇక ఈ చిత్రంలో రాశి సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా.. అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి, నితిన్ ప్రసన్న, రవి వర్మ, సుదర్శన్, కృష్ణ తేజ, నంద గోపాల్, ఎడ్విన్ లక్ష్మణ్ మీసాల, జీవా, అజీజ్ తదితరలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ సినిమాకి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ఆదిత్య జవ్వాది డీవోపీ కాగా, ప్రవీణ్ పూడి ఎడిటింగ్, ‘బేబీ’ సురేష్ భీమగాని ఆర్ట్ డైరెక్షన్ నిర్వహిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.