టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు టెక్నాలజీని సినీ రంగంలోకి పరిచయం చేయాలనే దృఢ సంకల్పంతో క్వాంటం భాగస్వామ్యంతో ‘లోర్వెన్ AI’ అనే సరికొత్త స్టూడియోను తాజాగా లాంచ్ చేశారు. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేసిన ఈ స్టూడియో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేతులమీదుగా ప్రారంభం అయింది. సినీ పరిశ్రమకు చెందిన అతిరధమహారధులు హాజరైన ఈ వేడుకు చాలా గ్రాండ్ గా జరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ.. “దిల్ రాజు గారు మా అందరికీ షాక్ ఇచ్చారు. అందరికంటే ముందుగా ఎఐని అడాప్ట్ చేసుకున్నారు. ఆయన ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. ఇలాంటివి చాలా యూజ్ ఫుల్ గా ఉంటాయి. రాజు గారు చాలా హ్యాపీగా ఉంది. ఇది అందరికీ హెల్ప్ అవుతుంది. దిల్ రాజు గారికి అభినందనలు” అని అన్నారు.
అలాగే ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. “రాజు గారు ఈ ప్రాజెక్టు గురించి చెప్తున్నప్పుడు ఆయన ఎంత హానెస్ట్ గా ఉన్నారో అర్థమైంది. ఈ ప్రోడక్ట్ లో ఆయన పేషన్ కనిపించింది. అప్డేట్ కావడం అంతా ఈజీ కాదు. దిల్ రాజు గారికి కంగ్రాట్యులేషన్స్. ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేయడానికి ఆసక్తిగా ఎదురు చేస్తున్నాను. ఇది క్రియేటివిటీని ఎన్హాన్స్ చేస్తుందని భావిస్తున్నాను. గుడ్ లక్” అని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























