ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ ‘తమ్ముడు’. ఈ చిత్రంలో సీనియర్ యాక్ట్రెస్ లయ కీలక పాత్రను పోషిస్తున్నారు. ప్రస్తుతం తమ్ముడు సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. దర్శకుడు శ్రీరామ్ వేణు వీలైనంత త్వరగా హై క్వాలిటీతో మూవీ కంప్లీట్ చేసి ప్రేక్షకులకు మర్చిపోలేని సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ను తమ్ముడు సినిమాతో అందించబోతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి సాలిడ్ అప్డేట్ అందింది. ఇప్పటికే పలుసార్లు వాయిదాపడిన తమ్ముడు సినిమా త్వరలో రిలీజ్ కాబోతోంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఆదివారం దర్శకుడు శ్రీరామ్ వేణు పుట్టినరోజు సందర్భంగా కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటించింది. దీనిప్రకారం, ఈ చిత్రం జూలై 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ఒక స్పెషల్ వీడియోను కూడా రిలీజ్ చేశారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థతో హీరో నితిన్, దర్శకుడు శ్రీరామ్ వేణుకు ప్రత్యేక అనుబంధం ఉంది. హీరో నితిన్ దిల్, శ్రీనివాస కళ్యాణం వంటి మూవీస్ చేయగా.. దర్శకుడు శ్రీరామ్ వేణు నాని హీరోగా ఎంసీఏ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వకీల్ సాబ్ వంటి సూపర్ హిట్ చిత్రాలు రూపొందించారు. ఇప్పుడు ఈ ముగ్గురి కాంబినేషన్ లో తమ్ముడు సినిమా వస్తుండటం సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























