శుభం నుండి ‘జన్మ జన్మల బంధం’ సాంగ్ రిలీజ్

Janma Janmala Bandham Full song Out From Samantha's Subham

టాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ సమంత ఒకవైపు కథానాయికగా చేస్తూనే మరోవైపు నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ అనే సొంత నిర్మాణ సంస్థను నెలకొల్పిన ఆమె.. ఈ బ్యానర్‌పై తన తొలి ప్రాజెక్ట్‌గా కొత్తవారితో ‘శుభం’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ విజయవంతంగా పూర్తయింది. మే 9న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా, మంచి రెస్పాన్స్ అందుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తాజాగా మ్యూజిక్ ప్రమోషన్స్‌ను కిక్ స్టార్ట్ చేసింది చిత్ర బృందం. దీనిలో భాగంగా శుభం నుండి ‘జన్మ జన్మల బంధం’ అనే పాట పూర్తి లిరికల్ వీడియోను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. షోర్ పోలీస్ (క్లింటన్ సెరెజో & బియాంకా గోమ్స్), జైన్ బాక్స్‌వాలా సాహిత్యం అందించగా.. గాయకులు బియాంకా గోమ్స్, జైన్ బాక్స్‌వాలా ఆలపించారు. చిత్రంలోని ప్రధానపాత్రలు పరిచయం చేసేలా సాగిన ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది.

వసంత్ మరిగంటి రాసిన ఈ కథను సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో సి. మల్గిరెడ్డి, శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఇక శుభం చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా మృదుల్ సుజిత్ సేన్, ప్రొడక్షన్ డిజైనర్‌గా రామ్ చరణ్ తేజ్, ఎడిటర్‌‌గా ధర్మేంద్ర కాకర్లాడ్ వంటి వారు పని చేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.