అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న నాలుగు రోజుల వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (వేవ్స్) ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న విషయం తెలిసిందే. గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా ఇది ప్రారంభమైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరో, కింగ్ అక్కినేని నాగార్జున ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ‘తెలంగాణ పెవిలియన్’ను శుక్రవారం ప్రారంభించారు. రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆడియో-విజువల్ ఫీల్డ్స్ గురించి, వాటి మౌలిక సదుపాయాల గురించి, ఇంకా విజువల్ మీడియా మరియు కంటెంట్ క్రియేషన్‌లో హైదరాబాద్ ఇటీవలికాలంలో ఓ పవర్‌ఫుల్ సెంటర్‌గా ఎదిగిన విధానాన్ని.. అలాగే ఇక్కడి వివిధ సినీ స్టూడియోల సమాచారాన్ని పొందుపరిచారు.
కాగా మన తెలుగు సినిమా స్థాయిని పెంచిన ‘బాహుబలి, పుష్ప, RRR, కల్కి’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల పోస్టర్‌లతో రాష్ట్రం నుండి వచ్చిన చిత్రాలను ప్రదర్శించడానికి తెలంగాణ పెవిలియన్ దోహదపడింది. ఇక ఈ చిత్రాలతో పాటు, పెవిలియన్‌లో యువ సందర్శకులను ఆకర్షించే ప్రసిద్ధ భారతీయ యానిమేటెడ్ షోల నుండి చోటా భీమ్, కాలియా మరియు చుట్కి వంటి కార్టూన్ పాత్రల కటౌట్స్ కూడా ఏర్పాటుచేశారు నిర్వాహకులు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. “ప్రజెంట్ జెనరేషన్ ఆడియెన్స్ ఎక్కువగా హీరోలను లార్జర్ దేన్ లైఫ్ రోల్స్‌లో చూడటానికి ఇష్టపడుతున్నారు. నేటి ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరూ ఎంతో ఒత్తిడితో కూడిన జీవన విధానాన్ని అవలంబిస్తున్నారు. దీంతో తమ ఒత్తిడి పోగొట్టుకునేందుకు సినిమాలకు వస్తున్నారు. ఈ క్రమంలో వారు నిజ జీవితానికి భిన్నంగా తెరపై జరిగే మ్యాజిక్‌ను చూసేందుకే ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. అందుకే బాహుబలి, పుష్ప రాజ్, రాఖీ భాయ్ (కేజీఎఫ్) సినిమాలు హ్యుజ్ సక్సెస్ సాధించడానికి అదే కారణం” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























