హిట్ 3 దేశ వ్యాప్తంగానే కాదు ఓవర్సీస్ లోకూడా అద్భుతమైన వసూళ్లను రాబడుతూ గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ సృష్టిస్తుంది. నానికి యూఎస్ లో సాలిడ్ మార్కెట్ వున్న విషయం తెలిసిందే.నానికి అక్కడ ఫ్యామిలీ ఆడియన్సు సపోర్ట్ చాలా వుంది.అయితే హిట్ 3 మాత్రం వారి తగ్గ కంటెంట్ తో రాలేదు.హెవీ వైలెన్స్ తో ఏ రేటెడ్ సినిమాగా వచ్చింది. అయినా కూడా నార్త్ అమెరికా లో మొదటి రోజు బీభత్సం సృష్టించింది.మొదటి రోజే 1 మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చి నాని కెరీర్ లో హైయెస్ట్ యూఎస్ఏ ప్రీమియర్స్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది.ఈరోజుతో 1.5 మిలియన్ డాలర్ క్లబ్ లో చేరనుంది.ఫుల్ రన్ లో ఈజీగా 2 మిలియన్ మార్క్ ను క్రాస్ చేసి నానికి కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందించనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మొదటి రోజు 43 కోట్లతో రచ్చ చేసిన హిట్ 3 రెండో రోజు కూడా సాలిడ్ హోల్డ్ తో దూసుకుపోతుంది.రెండో రోజు 20 కోట్ల వరకు వసూళ్లను రాబట్టుకునే ఛాన్స్ వుంది. ఈ ఆదివారంతో 100కోట్ల క్లబ్ లో చేరనుంది.ఫుల్ రన్ లో ఈసినిమా బయ్యర్లకు భారీ లాభాలను తీసుకురానుంది.విజయ్ దేవరకొండ కింగ్డమ్ వచ్చేవరకు బాక్సాఫీస్ వద్ద హిట్ 3కి ఎదురుఉండకపోవచ్చు.
శైలేష్ కొలను ఈసినిమాను డైరెక్ట్ చేయగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు.నాని తోకలిసి ప్రశాంతి తిపిర్నేని ఈసినిమాను నిర్మించారు.ప్రస్తుతం నాని యూఎస్ లో వున్నాడు.ఇండియా తిరిగి రాగానే భారీ సక్సెస్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























