ఆ విషయాల్లో ఆ హీరోలే నాకు స్ఫూర్తి – చిరంజీవి

Amitabh Bachchan, Kamal Haasan Are Inspiration For Me, Says Megastar Chiranjeevi

40ఏళ్లకు పైగా సుదీర్ఘ తన నటనా ప్రస్థానంలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఈ క్రమంలో నటనకు సంబంధించి ఒక్కో విషయంలో ఒక్కొక్కరు స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు ఆయన. కాగా అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘వరల్డ్‌ ఆడియో విజువల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌’ (వేవ్స్‌) పేరుతో ఒక వేడుక నిర్వహిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో ఇది గురువారం ముంబై లోని జియో కన్వెన్షన్‌ సెంటర్‌లో ప్రధాని మోదీ చేతులమీదుగా ప్రారంభం అయింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఈ బోర్డులో చిరంజీవి సహా పలువురు ప్రముఖ నటీనటులు సభ్యులుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో నిర్వహించిన చిట్ చాట్ కార్యక్రమంలో మాట్లాడుతూ, తనలో స్ఫూర్తినింపిన పలువురు నటులపై ప్రశంసలు కురిపించారు.

‘‘చిన్నవయసులో అప్పుడప్పుడు నా డ్యాన్స్‌ చూసిన ఫ్యామిలీ మెంబర్స్, బంధువులు, స్నేహితులు మెచ్చుకునేవారు. అలా నాకు నటనపై ఇంట్రెస్ట్ మొదలయింది. అదే చదువు పూర్తయ్యాక చెన్నై వెళ్లేలా చేసింది. అయితే నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టేనాటికి దాదాపు అరడజనుమంది సూపర్‌స్టార్స్‌ ఉన్నారు. ప్రేక్షకులు నన్ను నటుడిగా గుర్తించాలంటే, తప్పనిసరిగా నా ప్రత్యేకత చుపించాల్సిందే. దీంతో ఎలాగైనా అందరి దృష్టిని ఆకర్షించాలనే లక్ష్యంగా 1977లో నటనలో శిక్షణ పొందా.” అని తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఈ క్రమంలో ఒక్కో ఆర్టిస్ట్ నుంచి ఒక్కో విషయాన్ని నేర్చుకున్నా. మేకప్‌ లేకుండా సహజంగా నటించడంలో మిథున్‌ చక్రవర్తి, స్టంట్స్‌ విషయంలో అమితాబ్‌ బచ్చన్‌, అలాగే డ్యాన్స్‌ విషయంలో కమల్‌ హాసన్‌.. ఇలా వీరు నాకు స్ఫూర్తిగా నిలిచారు. అలా, వారి సినిమాలు చూస్తూ, వారి నటనను నిశితంగా గమనిస్తూ నన్ను నేను మలుచుకున్నాను’’ అని పేర్కొన్నారు చిరంజీవి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.