నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్: ది థర్డ్ కేస్’. హిట్ యూనివర్స్‌లో భాగంగా మూడవ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఆయన మోస్ట్ టెర్రిఫిక్ అండ్ బ్రూటల్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్‌గా నటించాడు. నాని సరసన ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేశారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సహా అన్నీ హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో హిట్ 3 రేపు పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిర్మాతల అభ్యర్ధన మేరకు విడుదలైన రోజునుంచి ఒక వారం పాటు టికెట్ల రేట్లు పెంచుకుందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు తాజాగా జీవోను రిలీజ్ చేసింది. దీని ప్రకారం.. ఒక్కో టిక్కెట్ పైన సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50 (జీఎస్టీ సహా), అలాగే మల్టీప్లెక్స్ లలో రూ.75 (జీఎస్టీ సహా) వరకు పెరుగుదల వుంటుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























