నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్: ది 3rd కేస్’. వాల్ పోస్టర్ సినిమా మరియు యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి తిపిర్నేనితో కలిసి నాని గ్రాండ్‌గా నిర్మించారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని టెర్రిఫిక్ అండ్ బ్రూటల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో కనిపిస్తుండగా.. ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ మే 1న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మావెరిక్ డైరెక్టర్ ఎస్ఎస్. రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే హిట్ 1, హిట్ 2 చిత్రాలలో హీరోలుగా నటించిన విశ్వక్ సేన్, అడివి శేష్ కూడా హాజరయ్యారు. వీరితోపాటు చిత్ర యూనిట్ అంతా పాల్గొంది.
ఈ సందర్భంగా ప్రసంగించిన హీరో నాని హిట్ 3 విజయంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పి అభిమానులను ఉత్సాహపరిచారు. “హిట్ 3తో మంచి హిట్ కొట్టబోతున్నాం. కళ్యాణ్ గారి స్టైల్‌లో చెప్పాలంటే ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అని అన్నారు నాని. దీంతో ఆడిటోరియం అభిమానుల కేరింతలతో ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. నాని నోటి వెంట పవన్ డైలాగ్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. కాగా ప్రస్తుతం ఈ వీడియోని పవర్ స్టార్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























