యంగ్ హీరో సందీప్ కిషన్ ,ధమాకా ఫేమ్ త్రినాధరావు నక్కిన కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా మజాకా.ఫిబ్రవరి లో థియేటర్లలో విడుదలైన ఈసినిమా పాజిటీవ్ రివ్యూస్ తెచ్చుకున్నా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయింది.ఇక ఆ తరువాత జీ 5 ఓటిటి లో స్ట్రీమింగ్ లోకి వచ్చింది.ఇక ఇప్పుడు మరో ఓటిటి లోకి కూడా అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ ఈరోజు నుండి తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మజాకా లో సందీప్ కిషన్ కు జోడిగా రీతూ వర్మ నటించగా రావు రమేష్ ,మన్మథుడు ఫేమ్ అన్షు కీలక పాత్రలు పోషించారు.లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్,హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మించారు.
ఇక ఈ సినిమా తరువాత సందీప్ ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ తనయుడు జాసన్ సంజయ్ డైరెక్షన్ లో నటిస్తున్నాడు.జాసన్ సంజయ్ కు ఇదే మొదటి సినిమా.ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతుంది.తమన్ సంగీతం అందిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























