శివాజీపై సుకుమార్ ప్రశంసల వర్షం

Director Sukumar Praises Actor Sivaji For His Impactful Role in Court

తెలుగు సినిమా పరిశ్రమలో గత కొన్ని సంవత్సరాలుగా తన నటనా ప్రతిభతో ప్రేక్షకుల మనసులను ఆకర్షిస్తున్నారు శివాజీ. ఇటీవల విడుదలైన ‘కోర్ట్’ సినిమాతో మరోసారి తన నటనా సత్తాను చాటాడు.. నాని నిర్మాతగా, ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటి ఇటీవలే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చి, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కోర్ట్ సినిమాలో శివాజీ పాత్ర అత్యంత కీలకమైనది కాగా, ఆయన నటనలోని సహజత్వం, భావోద్వేగ ప్రదర్శన ప్రేక్షకులను కట్టిపడేసింది. ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా ఈ చిత్రం గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. శివాజీ నటనకు నెటిజన్లు ఫిదా అవుతూ, ఆయన పాత్రను ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా, ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరుగాంచిన సుకుమార్ కూడా కోర్ట్ సినిమాను వీక్షించి, శివాజీ నటనకు ఫిదా అయ్యారు. సుకుమార్ శివాజీని, ఆయన నటన గురించి ప్రత్యేకంగా అభినందించారు. నిన్న సాయంత్రం వీరిద్దరూ కలిసి కొంత సమయం గడిపారు. ఈ సమావేశంలో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

కోర్ట్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన శివాజీ, ప్రస్తుతం బిజీ షెడ్యూల్‌తో ఉన్నారు. ఆయన ‘దండోరా’ అనే సినిమాలో నటిస్తున్నారు. అంతేకాకుండా, తన సొంత నిర్మాణంలో తాను హీరోగా లయ హీరోయిన్‌గా ఒక సినిమాను కూడా రూపొందిస్తున్నారు. నటుడిగా, నిర్మాతగా రెండు విభాగాల్లోనూ తన ప్రతిభను చాటుకోవడం శివాజీ విశేషం.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.