అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఫస్ట్ డే బానే రాబట్టింది

Arjun Son Of Vyjayanthi first day collections

డెవిల్ లాంటి ఎక్స్ పర్ మెంట్ తరువాత హీరో నందమూరి కళ్యాణ్ రామ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతితో నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.కమర్షియల్ ఎంటర్టైనర్ గా థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది.దాంతో తొలి రోజు సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది.ముఖ్యంగా నైట్ షోస్ బాగుండడంతో తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 5.15 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈరోజు, రేపు కూడా సాలిడ్ వసూళ్లను రాబట్టుకోనుంది.అయితే బ్రేక్ ఈవెన్ కావాలంటే 20కోట్ల పైనే రాబట్టాల్సివుంది.హిట్ 3 వచ్చే వరకు వేరే సినిమాలనుండి పోటీ లేకపోవడం అడ్వాంటేజ్ కానుంది.ప్రదీప్ చిలుకూరి తెరకెక్కించిన ఈసినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పవర్ ఫుల్ రోల్ లో నటించింది.ఇందులో యాక్షన్ పార్ట్ కు ప్రశంసలు దక్కుతున్నాయి.

అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిలో సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా సోహైల్ ఖాన్ విలన్ గా కనిపించాడు.శ్రీకాంత్,యానిమల్ పృథ్వీ రాజ్ ముఖ్య పాత్రలు పోషించారు.అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించగా భారీ బడ్జెట్ తో అశోక్ వర్ధన్ ముప్పా,సునీల్ బలుసు నిర్మించారు.

ఇక ఈసినిమా తరువాత కళ్యాణ్ రామ్ ఇంతవరకు మరో సినిమాను ప్రకటించలేదు.అయితే ఆయన బ్లాక్ బస్టర్ బింబిసార సీక్వెల్ ను నెక్స్ట్ చేసే ఛాన్స్ వుంది.తర్వలోనే ఈసినిమా విషయంలో ఓ క్లారిటీ రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.