నవీన్ చంద్ర ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘బ్లైండ్ స్పాట్’. మ్యాంగో మాస్ మీడియా బ్యానర్ పై రామ కృష్ణ వీరపనేని నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌కి రాకేష్ వర్మ దర్శకత్వం వహించాడు. అంచనాలను క్రమంగా పెంచుతోంది. కాగా ఈ చిత్రంలో రాశి సింగ్, అలీ రెజా, రవివర్మ, గాయత్రి భార్గవి కీలక పాత్రల్లో కనిపిస్తుండగా.. కిషోర్ కుమార్, హారిక పేడాడ, గురురాజ్ మానేపల్లి, హర్ష్ రోషన్, మాస్టర్ అభిషిక్త్ వంటి తారాగణం నటిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా చిత్రంలో కీలక పాత్రలో నటించిన గాయత్రి భార్గవి మాట్లాడుతూ.. “రాకేష్ చాలా క్లియర్ విజన్‌తో ఈ సినిమా తీశాడు. నవీన్ చంద్ర గారితో కలిసి యాక్ట్ చేయడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. ఈ సినిమాల్లో పని చేసిన అందరి నుంచి చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను. ఈ సినిమాలో చాలా కొత్త రోల్‌లో కనిపిస్తాను. తప్పకుండా మీ అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను” అని అన్నారు.
అలాగే మరో ముఖ్య పాత్రను పోషించిన యాక్టర్ రవి వర్మ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఈ సినిమాలో మంచి పర్ఫార్మెన్స్ స్కోప్ వుండే క్యారెక్టర్ చేశాను. నవీన్ చంద్రతో కలిసి యాక్ట్ చేయడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. తను ఫైనెస్ట్ యాక్టర్. రాశి చాలా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది. రాకేష్ చాలా క్లియర్ విజన్‌తో ఈ సినిమా తీశాడు. ఈ సినిమా మీ అందరిని అలరిస్తుందని కోరుకుంటున్నాను” అని చెప్పారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























