ఈవారం రెండు సినిమాలు రానున్నాయి 

This week two notable Telugu films are set to release in theaters

గత వారం తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి  రిలీజ్ కాలేదు.డబ్బింగ్ సినిమా అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ మాత్రమే పెద్ద సినిమాగా వచ్చింది. అయితే  ఈ వారం రెండు హైప్ వున్న తెలుగు సినిమాలు  థియేటర్లలో సందడి చేయనున్నాయి.అందులో ఓదెల 2 ఒకటి కాగా మరొకటి  కళ్యాణ్ రామ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఈ రెండు సినిమాలకు మంచి బజ్ వుంది. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇందులో మొదటగా ఓదెల 2  విడుదలకానుంది.రేపు  ఈసినిమా థియేటర్లలోకి రానుంది.తమన్నా భాటియా లీడ్  రోల్ లో నటించగా ఓదెల రైల్వే స్టేషన్ కు సీక్వెల్ గా వస్తుంది. టీజర్ , ట్రైలర్ తో అంచనాలు పెరిగిపోయాయి.ఈసినిమాను అశోక్ తేజ డైరెక్టర్ చేయగా హెబ్బా పటేల్,మురళి శర్మ ,యువ కీలక పాత్రల్లో  నటించారు.కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించాడు. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఈసినిమాకు ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.  

ఇక అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈ శుక్రవారం రిలీజ్ కానుంది.నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించగా ప్రముఖ నటి విజయశాంతి కీలక పాత్రలో కనిపించనుంది. ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేశారు.ట్రైలర్ తో సినిమా పక్కా హిట్ అనే టాక్ తెచ్చుకుంది.కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే  హైయెస్ట్  ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 

ఈసినిమాని ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేయగా బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది.శ్రీకాంత్,యానిమల్ పృథ్వీ రాజ్, సోహైల్ ఖాన్ ముఖ్య పాత్రలు పోషించారు.అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించగా భారీ బడ్జెట్ తో అశోక్ వర్ధన్ ముప్పా,సునీల్ బలుసు నిర్మించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.