బాలకృష్ణ నెక్స్ట్ మూవీ ఫిక్స్ ?

​Nandamuri Balakrishna is set to reunite with director Gopichand Malineni for a new action-packed Telugu film

మినిమమ్ గ్యాప్ తీసుకోకుండా సినిమాలు పూర్తి చేసే హీరోల్లో బాలకృష్ణ ఒకరు.ఒక సినిమా పూర్తయ్యే లోపు మరో సినిమాను లైన్లో పెడతాడు.అంతేకాదు అఖండ నుండి ప్లాప్ అన్నదే తెలియకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు ఈ సీనియర్ హీరో.రీసెంట్ గా సంక్రాంతికి డాకు మహారాజ్ తో వచ్చి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.ఇక ప్రస్తుతం బాలకృష్ణ అఖండ 2 చేస్తున్నాడు.బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తుంది.అఖండ సీక్వెల్ కావడంతో ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.తమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తుంది.షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా తరువాత బాలకృష్ణ నెక్స్ట్ చేయబోయే సినిమా ఫిక్స్ అయ్యిందంటూ వార్తలు వస్తున్నాయి.అందులో భాగంగా డైరెక్టర్ గోపిచంద్ మలినేని తో బాలకృష్ణ నెక్స్ట్ సినిమా చేయనున్నాడట.ప్రస్తుతం నిర్మాతలను వెతికే పనిలో వున్నారు.అన్ని కుదిరితే బాలకృష్ణ బర్త్ డే జూన్ 10న ఈసినిమా లాంచ్ అయ్యే ఛాన్స్ వుంది.

అయితే గోపిచంద్ మలినేనితో బాలయ్య సినిమా చేయడం ఇది రెండోసారి.ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వీర సింహరెడ్డి వచ్చింది.ఈసినిమా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఇక ఇప్పుడు గోపిచంద్ మలినేనికి రెండో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది.ఈ సారి కూడా ఈ డైరెక్టర్ బాలకృష్ణ తో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను ప్లాన్ చేస్తున్నాడట.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.