యాక్షన్ సినిమాలని ఎంజాయ్ చేసే ఆడియన్స్‌కి మే 1న ఫుల్ మీల్స్

Natural Star Nani and Director Sailesh Kolanu Reveals Interesting Facts About Hit 3

నేచురల్ స్టార్ నాని తన అప్ కమింగ్ హిట్: ది 3rd కేస్‌లో మోస్ట్ ఇంటెన్స్ అండ్ వైలెంట్ అవతార్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా గ్లింప్స్, టీజర్, పాటలు, ఇతర ప్రమోషనల్ కంటెంట్‌ ట్రెమండస్‌తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

HIT: ది 3rd కేస్ మే 1న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ఈరోజు వైజాగ్ సంగమ్ థియేటర్‌లో భారీగా తరలివచ్చిన అభిమానులు సమక్షంలో లాంచ్ చేశారు. అనంతరం హైదరాబాద్‌లో నిర్వహించిన క్యూ అండ్ ఏ ప్రెస్ మీట్‌లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు హీరో నాని మరియు డైరెక్టర్ శైలేష్ కొలను సమాధానాలు ఇచ్చారు.

నాని గారు ట్రైలర్‌ని ఇంత ముందుగా రిలీజ్ చేయడానికి కారణం సినిమా గురించి ఆడియన్స్‌ని ప్రిపేర్ చేయడమా?

  • టీజర్ తోనే ఆడియన్స్ సినిమా ఎలా వుంటుందో ప్రిపేర్ అయ్యారు. ట్రైలర్ ఇంత ముందుగా రిలీజ్ చేయడానికి కారణం.. ఇంకాస్త ఎక్సయిట్‌మెంట్ పెంచడం, అలాగే ఇది ఎంత స్ట్రాంగ్ కంటెంట్ వున్న ఫిల్మ్ అని చెప్పడం. గ్రేట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది.
  • ఎమోషన్ స్ట్రాంగ్ వున్నప్పుడు వైలెన్స్ పండుతుంది. ఈ సినిమాలో వైలెన్స్ చూస్తున్నప్పుడు పూనకం వస్తుంది. దానికి కారణం ఆ సీన్స్‌లో వుండే ఎమోషన్. యాక్షన్ డిజైన్ సరికొత్తగా వుంటుంది.

నాని గారు ఇంత వైలెన్స్ వున్న సినిమాలో చాగంటి గారి ప్రవచనం వాడటానికి కారణం?

  • కథలో చాలా ముఖ్యమైన కనెక్షన్ వుంది. శైలేష్ ఈ కథ ఐడియా చాగంటి గారికి చెప్పారు. ఆయనకి చాలా నచ్చింది. చాగంటి గారు సినిమా కోసం ప్రత్యేకంగా చెప్పారు.

శైలేష్ గారు ఈసారి యాక్షన్ కోసం ఎలాంటి వర్క్ చేశారు?

  • ఈ సినిమాలో యాక్షన్ కొరియోగ్రఫీకి చాలా ప్రాధాన్యత వుంటుంది. లీ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. స్క్రీన్‌పై చాలా కొత్తగా వుంటుంది. ఇది చాలా డిఫరెంట్ జోనర్ మూవీ.

నాని గారు ఇంత వైలెన్స్ సినిమా ఆడియన్స్‌పై ఎలాంటి ఇంపాక్ట్ వుంటుంది?

  • మనకంటే పదింతలు వైలెన్స్ సినిమాలు తీసే దేశాల్లో మన కంటే క్రైమ్ రేట్ తక్కువగా వుంది. మన బుద్ధి సరిగ్గా వుండాలి. సినిమా అనేది బాధ్యత. మేము ఎంత బాధ్యతగా తీశామో సినిమా చూస్తే మీకే అర్ధమౌతుంది.

కోర్ట్ సినిమా నచ్చకపొతే హిట్ 3 చూడొద్దు అన్నారు కదా.. మరి హిట్ 3 గురించి ఏం చెబుతారు?

  • హిట్ 3కి నేను నిర్మాతని కాబట్టి అలా చెప్పగలిగాను (నవ్వుతూ). అయితే హిట్ 3 లాంటి రేసీ థ్రిల్లర్, ఇలాంటి యాక్షన్ సినిమాలని ఎంజాయ్ చేసే ఆడియన్స్‌కి మే 1న ఫుల్ మీల్స్. ఒక కొత్త థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. నేను చెప్పింది కరెక్ట్ కాదనిపిస్తే నెక్స్ట్ టైం నానిని నమ్మకండి (నవ్వుతూ).

నాని గారు ఈ సినిమాలో మీకు కనెక్ట్ అయిన పాయింట్ ఏమిటి?

  • ఈ కథ విన్తున్నప్పుడే కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. శైలేష్ చాలా కొత్తగా సినిమాని డీల్ చేశాడు. నాకే చాలా విషయాలు కొత్తగా అనిపించాయి. ఈ సినిమా కోసం చాలా ఎఫర్ట్ పెట్టాం. అది మీరు స్క్రీన్ మీద చూస్తారు.

శైలేష్ గారు అర్జున్ క్యారెక్టర్‌కి స్ఫూర్తి ఉందా?

  • ఇది లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్. దాన్ని ఫిక్షనల్ గానే క్రియేట్ చేశాం.
  • ఈ సినిమాలో మంచి మెసేజ్ కూడా వుంది. ధర్మం కోసం నిలబడ్డ మనిషి ఎంత దూరం వెళ్ళాడనేది ఇందులో చూస్తారు. చాలా డిఫరెంట్ ఫిల్మ్. చాలా యూనిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.