అజిత్ కూడా ఆ క్యారెక్టర్ సునీలే చేయాలని అన్నారు

Director Adhik Ravichandran Praises Actor Sunil Performance in Good Bad Ugly

వెరీ సక్సెస్ ఫుల్ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, కోలీవుడ్ ఐకాన్ అజిత్ కుమార్‌ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సంభవం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. టి-సిరీస్‌ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పించారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ సంభవం సక్సెస్ ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్ బస్టర్ సంభవం సెలబ్రేషన్స్ నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమాకి మ్యూజిక్ స్ట్రాంగ్ పిల్లర్. జీవి ప్రకాష్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రియా క్యారెక్టర్ ఆడియన్స్ ని అలరించింది. కార్తికేయ క్యారెక్టర్ కూడా ఈ సినిమాకి చాలా క్రూషియల్. సునీల్ గారు ఇందులో క్యారెక్టర్ చేయడం నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది.”

“అజిత్ గారు కూడా ఆ క్యారెక్టర్ ని సునీల్ గారు చేస్తేనే బాగుంటుందని అన్నారు. చాలా హార్డ్ వర్క్ చేశారు. డిఓపి అభినందన్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. మైత్రి మూవీ మేకర్స్ కి థాంక్యూ. వాళ్లు తమిళ్ లో చేసిన ఫస్ట్ సినిమా ఇది. నాకు చాలా సపోర్ట్ చేశారు. నవీన్ గారు లాంటి హంబుల్ స్వీట్ ప్రొడ్యూసర్ ని నేను చూడలేదు. చాలా గొప్పగా చూసుకున్నారు.”

“ఈ సినిమా హ్యుజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందంటే కారణం నవీన్ గారు. మైత్రి మూవీ మేకర్స్ తమిళనాడులో హిస్టరీ క్రియేట్ చేశారు. వారి సపోర్ట్ కి థాంక్యూ. ప్రతి డైరెక్టర్ డ్రీమ్ మైత్రి మూవీ మేకర్స్ తో వర్క్ చేయడం. నన్ను బిలీవ్ చేసి ఈ సినిమా ఇచ్చిన అజిత్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆయన సపోర్ట్ ని మర్చిపోలేను. ఈ సినిమాని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసిన ఆడియన్స్ అందరికీ కృతజ్ఞతలు” అని తెలిపారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.