రివ్యూ  : గుడ్ బ్యాడ్ అగ్లీ  

Good Bad Ugly review in telugu

నటీనటులు : అజిత్, త్రిష ,సునీల్ ,అర్జున్ దాస్ ప్రియా ప్రకాష్ వారియర్ 
ఎడిటింగ్ : విజయ్ వేలుకుట్టి 
సినిమాటోగ్రఫీ : అభినందన్ రామానుజం
సంగీతం : జివి ప్రకాష్ కుమార్
దర్శకత్వం :అధిక్ రవిచంద్రన్
నిర్మాణం : మైత్రి మూవీ మేకర్స్

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ట్రైలర్ ,సాంగ్స్ తో సంబంధం లేకుండా తమ సినిమాలకు హైప్ క్రియేట్ చేయగల సత్తా వున్న హీరోల్లో తల అజిత్ ఒకరు.ఈ  స్టార్ హీరో నటించిన లేటెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ.అజిత్ వీరాభిమాని అధిక్ రవిచంద్రన్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.తమిళంలో ఈ సంస్థ కు ఇదే మొదటి సినిమా.టీజర్ ,ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.ఇక ఈ రోజే ఈసినిమా తమిళ్ తో పాటు తెలుగులోనూ విడుదలైయింది.మరి గుడ్ బ్యాడ్ అగ్లీ ఎలా వుంది.అజిత్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిందో లేదో తెలుసుకుందాం. 

కథ : 

డేంజరస్  గ్యాంగ్ స్టర్ అయిన ఏకే (అజిత్)  తన భార్య కోసం అన్ని వదిలేసి జైలుకు వెళ్తాడు.ఈక్రమంలో ఏకే తాలూకు గతం వల్ల తన కొడుకు ఇబ్బందుల్లో చిక్కుకుంటాడు.ఇంతకీ ఏకే గ్యాంగ్ స్టార్ గా ఎందుకు మారాల్సి వచ్చింది. ఏకే కొడుకును ఎందుకు టార్గెట్ చేస్తారు? ఆ గ్యాంగ్ నుండి ఏకే తన ఫ్యామిలీని ఎలా రక్షించుకున్నాడు అనేది మిగితా కథ. 

విశ్లేషణ : 

కథ లో కొత్తదనం లేకపోయినా ప్రెసెంటేషన్ తో మ్యాజిక్ చేశాడు డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్.ఇంట్రో సీన్ నుండే  ఫ్యాన్ బాయ్ డ్యూటీ చేశాడు.అజిత్  ఫ్యాన్స్ కు కావాల్సిన  స్టఫ్ అంతా కలిపి సినిమాను తెర మీదకు తీసుకొచ్చాడు.ఫస్ట్ హాఫ్ లో అజిత్ ఇంట్రో  సీన్ నుండి ఇంటర్వెల్ వరకు సినిమా ఫుల్  హై తో ఎక్కడా  తగ్గకుండా ఫ్యాన్స్  ఫుల్  శాటిస్ పై చేస్తుంది.గ్యాంగ్ స్టర్ గా అజిత్ చెలరేగిపోయాడు.చాలా చోట్ల వింటేజ్ అజిత్ ను చూపించాడు డైరెక్టర్.అజిత్ పాత సినిమాల రిఫరెన్సులను బాగా వాడుకున్నాడు. ఎలివేషన్ సీన్లు బాగా వర్క్ అవుట్ అయ్యాయి.

 ఇంటర్వెల్ ముందు వచ్చే  సన్నివేశాల అయితే  ఫ్యాన్స్ కి ఫీస్ట్.ఇక సెకండ్ హాఫ్ కూడా ఎక్కడా డిస్సపాయింట్ చేయలేదు. డీసెంట్ గా సాగిపోద్ది.ఓవరాల్ గా  గుడ్ బ్యాడ్ అగ్లీ లో ఫస్ట్  హాఫ్ సూపర్ అనిపించగా సెకండ్ హాఫ్ డీసెంట్ అనిపిస్తుంది.ముఖ్యంగా అజిత్ ఫ్యాన్స్ కి ఈసినిమా బాగా నచ్చుతుంది.అలాగే అజిత్ రీసెంట్ సినిమాల్లో గుడ్ బ్యాడ్ అగ్లీ బెస్ట్ అనిపించుకుంటుంది. 

నటీనటుల విషయానికి వస్తే అజిత్ డిఫ్రెంట్ గెటప్ లలో ఎనర్జిటిక్ యాక్టింగ్ తో అదరగొట్టాడు.తన స్వాగ్ తో స్క్రీన్ పై వన్ మ్యాన్ షో చేశాడు.చాలా చోట్ల  వింటేజ్ అజిత్ కనిపించాడు.ఫిమేల్ లీడ్ లో  త్రిష మెప్పించింది.తన స్క్రీన్ టైం తక్కువగా వున్నా ఉన్నంతలో బాగా చేసింది సునీల్ కి ఫుల్ లెంగ్త్ రోల్ పడింది. తన గెటప్ కూడా కొత్తగా వుంది.విలన్ పాత్రలో నటించిన అర్జున్ దాస్ సూపర్ గా చేశాడు. ప్రియా ప్రకాష్ వారియర్ కీలక పాత్రలో  కనిపించింది.   

టెక్నికల్ గా కూడా సినిమా బాగుంది.సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది.విజువల్స్ చాలా కలర్ ఫుల్ గా వున్నాయి.ఎడిటింగ్ ఓకే.సంగీతం విషయానికి వస్తే  పాటలు  డీసెంట్ గా వున్నా బీజీఎమ్ బాగుంది.చాలా సన్నివేశాలను ఎలివేట్ చేసింది. మైత్రి నిర్మాణం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.సూపర్ క్వాలీటీతో సినిమాను నిర్మించారు. 

ఓవరాల్ గా భారీ అంచనాల మధ్య వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ ఆ అంచనాలను అందుకుందని చెప్పొచ్చు.అజిత్ నటన ,బీజీఎమ్ , డైరెక్షన్ సినిమాలో హైలైట్ అయ్యాయి.అజిత్ ఫ్యాన్స్ కు ఈ సినిమా బాగా నచ్చుతుంది.మిగితా వారు కూడా ఈజీగా ఓసారి చూసేయొచ్చు. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.