ప్రామిసింగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో నారీ నారీ నడుమ మురారి ఒకటి.సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతుంది.రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో సాక్షి వైద్య,సంయుక్త మీనన్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ దర్శనమేను ఈరోజు రిలీజ్ చేశారు.క్లాసిక్ మెలోడీ గా వచ్చిన ఈసాంగ్ మనసుని కట్టిపడేస్తుంది.యాజిన్ నిజార్ వోకల్స్ పాటను మరో స్థాయికి తీసుకెళ్తాయి.రామజోగయ్య శాస్త్రి సాహిత్యం శర్వా ఎమోషన్స్ అద్భుతంగా వర్ణించింది.విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా అనిల్ సుంకర ఈసినిమాను నిర్మిస్తున్నాడు.మేలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఇక శర్వానంద్ ప్రస్తుతం అభిషేక్ కంకర డైరెక్షన్ లో కూడా ఓ సినిమా చేస్తున్నాడు.యువీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండగా గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.ఇది కూడా ఈ ఏడాదే విడుదలకానుంది.
ఈరెండు కాకుండా శర్వానంద్ మూడో సినిమాకి కూడా కమిట్ అయ్యాడు.సంపత్ నంది డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ ను చేయనున్నాడు.త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు.ఇందులో శర్వా డిఫ్రెంట్ లుక్ లో కనిపించనున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























