రేపు నాలుగు సినిమాలు రిలీజ్

Four noted movies are hitting theaters tomorrow

రేపు ఒక్కో ఇండస్ట్రీ నుండి ఒక్కో నోటెడ్ సినిమా రిలీజ్ అవుతుంది.అందులో తెలుగు నుండి జాక్ తమిళం నుండి గుడ్ బ్యాడ్ అగ్లీ , హిందీ నుండి జాట్ మళయాలం నుండి బజూకా థియేటర్లలోకి వస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇందులో అజిత్ నటించిన సినిమా కావడంతో గుడ్ బ్యాడ్ అగ్లీ కి ఎక్కువ హైప్ వుంది.తమిళనాడు లో మొదటి రోజు బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్ లో వున్నాయి.హిట్ టాక్ వస్తే భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది.అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేయగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. తమిళంలో ఈ సంస్థకు ఇదే మొదటి సినిమా.గుడ్ బ్యాడ్ అగ్లీ రేపు తెలుగులో కూడా విడుదలకానుంది.

ఇక తెలుగు నుండి యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ జాక్ కొంచెం క్రాక్ కూడా రేపే వస్తుంది.డీజే టిల్లు ,టిల్లు స్క్వేర్ తో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు సిద్దు. దాంతో జాక్ పై అంచనాలు వున్నాయి. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేయగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. ఎస్విసిసి నిర్మించింది.

అలాగే హిందీ నుండి రేపు జాట్ రిలీజ్ అవుతుంది.తెలుగు డైరెక్టర్ గోపిచంద్ మలినేని ఈసినిమాను డైరెక్ట్ చేయగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , మైత్రి మూవీ మేకర్స్ నిర్మించాయి.సన్నీ డియోల్ ఇందులో హీరోగా నటించగా తమన్ సంగీతం అందించాడు.ట్రైలర్ సినిమాకి బజ్ తీసుకొచ్చింది. ప్రస్తుతానికి హిందీలో మాత్రమే రిలీజ్ అవుతుంది.

ఇక మళయాలం నుండి బజూకా రేపు విడుదలకానుంది.మమ్ముట్టి ,గౌతమ్ వాసు దేవ్ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించగా డీనో డెన్నిస్ డైరెక్ట్ చేశాడు. కేవలం మలయాళంలో మాత్రమే రిలీజ్ అవుతుంది.ఈసినిమా పై అక్కడ మంచి అంచనాలు వున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.