ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు 43వ జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు పలువురు సినీ ప్రముఖులు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలో స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా అల్లు అర్జున్‌ని ‘బావ’ అని సంభోదిస్తూ ప్రత్యేక పోస్ట్ పెట్టాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
”జన్మదిన శుభాకాంక్షలు అల్లు అర్జున్ బావ. ఈ సంవత్సరం నీకు మరింత శక్తి, ప్రేమతో పాటు మరిన్ని విజయాలు తీసుకురావాలని కోరుకుంటున్నా” అని పేర్కొన్నారు ఎన్టీఆర్. దీనిపై స్పందించిన అల్లు అర్జున్.. “బావా.. నువ్వు చెప్పిన శుభాకాంక్షలకు చాలా థ్యాంక్స్. నీకు మరింత ప్రేమ, శక్తి కలగాలని కోరుకుంటున్నా” అని రిప్లై ఇచ్చారు. ఇక మరోవైపు ఐకాన్ స్టార్ అభిమానులతో పాటు పలువురు నెటిజన్లు కూడా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అలాగే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఐకాన్ స్టార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. త్రివిక్రమ్, బన్నీ కలయికలో ఇప్పటివరకూ 3 సినిమాలు రాగా, ఒకదానిని మించి ఒకటి హిట్ అయ్యాయి. త్వరలోనే వీరి కాంబోలో మైథలాజికల్ మూవీ తెరకెక్కబోతోంది. అలాగే మరో దర్శకుడు సంపత్ నంది కూడా అల్లు అర్జున్ కి విషెస్ తెలియజేశారు. ఇక ఇదిలావుంటే, మరోవైపు ఐకాన్ స్టార్ అభిమానులతో పాటు పలువురు నెటిజన్లు కూడా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























