‘డీజే టిల్లు’ ఫ్రాంచైజీ చిత్రాల బ్లాక్‌బస్టర్స్ తర్వాత స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘జాక్ – కొంచెం క్రాక్’. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. సిద్ధు సరసన ‘బేబీ’ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన జాక్ టీజర్, ట్రైలర్ మరియు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ఈ సినిమా సెన్సార్ కూడా కంప్లీట్ అయ్యింది. సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. 2 గంటల 10 నిమిషాల రన్ టైం కలిగివుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా ఏప్రిల్ 10న గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ ముమ్మురం చేసిన మేకర్స్, దీనిలో భాగంగా నేడు జాక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయనున్నారు. హైదరాబాద్ లోని ప్రముఖ హోటల్ ఆవాస వేదికగా ఈరోజు సాయంత్రం 6గం.కు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ వేడుకకు హీరో సిద్దు జొన్నలగడ్డ, హీరోయిన్ వైష్ణవి చైతన్య, డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ సహా చిత్ర యూనిట్ అంతా హాజరుకానుంది. అలాగే ఈ కార్యక్రమానికి స్టార్ హీరో రానా దగ్గుబాటి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
కాగా ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో మెప్పించనున్నారు. ఇక ఈ చిత్రం కోసం మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు రాజమణి అద్భుతమైన సౌండ్ ట్రాక్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ ‘జాక్- కొంచెం క్రాక్’ సినిమాని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత సిద్దు జొన్నలగడ్డ నుంచి వస్తోన్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు కూడా భారీగానే వున్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























