గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది గ్లింప్స్ ఆల్ టైం రికార్డు సృష్టించింది.నిన్న టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా ఈ వీడియో 24 గంటల్లో 36 .5 మిలియన్ల రియల్ టైం వ్యూస్ తో 24గంటల్లో టాలీవుడ్ లో అత్యధిక వ్యూస్ ను రాబట్టిన మొదటి గ్లింప్స్ గా రికార్డు సృష్టించింది.ఇంతకుముందు ఈ రికార్డు దేవర పేరు మీద వుంది.దేవర 24 గంటల్లో 26.14 మిలియన్ల వ్యూస్ ను రాబట్టి మొదటి స్థానంలో ఉండేది.పెద్ది కేవలం 18 గంటల్లోనే ఆ రికార్డును బ్రేక్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కేవలం సింగిల్ లాంగ్వేజ్ లోనే ఈ రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక ఈరోజు హిందీ గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు.దీనికి రామ్ చరణ్ హిందీ లో డబ్బింగ్ చెప్పాడు. మొత్తానికి గ్లింప్స్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.ఇప్పటివరకు 25 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది.త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఈ ఏడాది లో షూటింగ్ కంప్లీట్ చేయనున్నారు.
రూరల్ బ్యాక్డ్ డ్రాప్ లో ఉప్పన ఫేమ్ బుచ్చి బాబు సానా తెరకెక్కిస్తున్న ఈసినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.
వచ్చే ఏడాది మార్చి 27న పెద్ది రిలీజ్ కానుంది.అదే రోజు చరణ్ బర్త్ డే కూడా.అయితే అంతకన్నా ఒక్క రోజు ముందు నాని- శ్రీకాంత్ ఓదెల మచ్ అవైటెడ్ మూవీ ది ప్యారడైజ్ కూడా రానుంది.దాంతో బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాల మధ్య ఆసక్తికర పోటీ జరుగనుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























