పవర్ ఫుల్‌గా జాట్ మ్యూజిక్ – తమన్

Music Director Thaman Confirms Composing Work Completed For JAAT

బాలీవుడ్‌ స్టార్ హీరో సన్నీ డియోల్‌ గతేడాది ‘గదర్ 2’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. దీనితర్వాత ఆయన ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘జాట్’. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లు మైత్రీ మూవీ మేకర్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్‌లో వేగం పెంచారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్, టీజర్‌, థియేట్రికల్ ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది.

అలాగే ఇటీవలే విడుదలచేసిన ఫస్ట్ సింగిల్ ‘టచ్ కియా’, నిన్న శ్రీరామ నవమి సందర్భంగా విడుదల చేసిన సెకండ్ సింగిల్ కూడా మ్యూజిక్ లవర్స్‌ని ఇంప్రెస్ చేశాయి. ఈ నేపథ్యంలో జాట్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది. ఈ మూవీ మ్యూజిక్ వర్క్ కంప్లీట్ అయింది. ఈ మేరకు సంగీత దర్శకుడు ఎస్ తమన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. జాట్ మ్యూజిక్ అదిరిపోతుందని, పవర్ ఫుల్‌గా ఉండబోతుందని తెలిపాడు.

కాగా ఈ చిత్రంలో సన్నీ సరసన సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా కథానాయికలుగా నటిస్తుండగా.. బీటౌన్‌ స్టార్ యాక్టర్ రణ్‌దీప్‌ హుడా విలన్‌గా నటిస్తున్నాడు. అలాగే మరో ప్రముఖ హిందీ నటుడు వినీత్ కుమార్ సింగ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇంకా స్వరూపా ఘోష్, రమ్యకృష్ణ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాకి రిషి పంజాబి సినిమాటోగ్రఫర్‌గా, అవినాష్‌ కొల్ల ప్రొడక్షన్‌ డిజైనర్‌గా వర్క్‌ చేస్తున్నారు. కాగా ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లు మైత్రీ మూవీ మేకర్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.